శ్రీకాకుళం నియోజకవర్గంలోని శిలగాం సింగువలస, తండెంవలస, అంపోలు లో జగనన్న సురక్ష క్యాంప్ లో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు,
శ్రీకాకుళం, జూలై 06: శిలగాం - శింగువలస (ఎస్.ఎస్.వలస) లో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.."గత నెల 23 వ తేదీ నుంచి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాం. సమాజంలో ఎవరో సహాయం ఉంటేనే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లాలి అనే..నిస్పృహలో కొన్ని వర్గాలు ఉండిపోయాయి.
మా బ్రతుకులు ఎప్పటికీ ఇంతే అనే నిరుత్సాహంలో ఉండిపోయాయి. వారందరికీ భరోసా ఇస్తూ 11 రకాల సేవలను అందుబాటులోకి తీసుకుని వచ్చాం.
241 ఆదాయ,217 కుల ధ్రువీకరణలతోపాటు,ఇతర ధ్రువీకరణలకు సంబంధించి 20 సర్టిఫికెట్లను అందించాం. వీటిని గతంలో అవసరం అయినప్పటికీ మీరు పొందలేకపోయారు. కానీ ఈ రోజు మీ గ్రామంలోనే జగనన్న సురక్ష క్యాంప్ పెట్టి అందించాం. వలంటీర్లు మీ ఇంటికి వచ్చి మీ,మీ అవసరాలను గుర్తించి వాటిని నివృత్తి చేస్తున్నారు. ఇదే విధంగా నియోజవర్గంలో సుమారు 30 వేల మందికి ఈ సహాయం అందనుంది. స్వతంత్రం వచ్చి కూడా మా బ్రతుల్లో మార్పు లేదు అనే వర్గాలకు అండగా ఉండాలి అని అనేక కార్యక్రమాలను జగన్ ప్రభుత్వం చేపట్టింది. ఎన్నికల ముందే చెప్పాం. పాదయాత్ర లో చెప్పినవి మ్యానిఫెస్టోలో పెట్టాము. అందులో పొందుపరిచినవి అని అమలు చేశాము. ఇవన్నీ సత్ఫలితాలు ఇచ్చాయి. అందుకోసమే ఇవాళ గ్రామంలో పెను మార్పు వచ్చింది.
సంక్షేమం పేరిట మన కన్నా ఎక్కువ ఇస్తాం అంటూ ప్రతిపక్షాలు బయలు దేరాయి. గతంలో అధికారంలో ఉన్నారు కదా ఏం సాధించారు ? ఏం చేశారు ? అని ప్రశ్నిస్తున్నా. వంశధార ప్రాజెక్టు ఫేజ్ - 2 పూర్తి చేసి, వచ్చే ఏడాది నుంచి మే నెలలో నీరు అందిస్తాం. మీ గ్రామంలో వచ్చిన మార్పులకు వై.ఎస్.జగన్ ప్రభుత్వం కృషి ఉంది. దేశంలో అని రాష్ట్రాలకు ఏపీ ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటు చేసి, అని డిపార్ట్మెంట్లకూ చెందిన అధికారులను నియమించాం. పాలనను మరింత స్థానికం చేశాం. గ్రామాల్లో విలేజ్ క్లినిక్ లు తీసుకుని వచ్చాము. రైతులకు ఆర్బీకేలు నెలకొల్పాము. నాడు - నేడు కార్యక్రమంతో ప్రభుత్వ బడుల్లో మార్పులు తీసుకు వచ్చాం. ఈ మార్పులన్నింటినీ మీరు ఒక్కసారి గమనించాలి.
రైతులు వరికి బదులుగా వాణిజ్య పంటల వైపు మొగ్గు చూపాలి. 19 టీఎంసీల నీరు నింపడానికి 185 కోట్ల రూపాయలతో హిరమండలం గొట్టా బ్యారేజ్ వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నాం. ఉద్దానానికి సైతం వంశధార నీరు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ గ్రామంలో డ్రైన్ కావాలి అని అడిగారు. ఇందుకు రూ.5 లక్షలు మంజూరు చేయమని సంబంధిత అధికారులకు ఆదేశించాను. ఎస్.ఎస్.వలసలో ఇంటింటికీ తాగు నీరు అందిస్తాం. సంబంధిత పనులు కూడా ప్రారంభించాం. కుటుంబంలో ఉన్న అందరి గౌరవం నిలిపేది స్త్రీమూర్తి మాత్రమే అని నమ్మి,అన్ని పథకాలు ఆమె పేరు మీదనే ఇస్తున్నాం. రైతులకు ఉన్న అప్పులన్నీ తీర్చేస్తాం అని చంద్రబాబు ఆ రోజు నమ్మ బలికారు. అటుపై రైతులను,మహిళలను మోసం చేశారు. 2014 ఎన్నికలు ముందు చెప్పిన ఏ ఒక్కటీ అధికారం అందుకున్నాక నెరవేర్చలేకపోయారు. రైతులకు రుణమాఫీ అని చెప్పారు మోసం చేశారు. మళ్లీ ఇప్పుడు కేజీ బంగారం ఇస్తాం అని బయలు దేరారు నమ్మకండి.." అని పేర్కొంటూ విపక్షాల తీరును దుయ్యబడుతూ,వారు గతంలో తీసుకుని వచ్చిన విధానాలను వివరిస్తూ,తాము తీసుకు వచ్చిన సంక్షేమ రీతిని ఉదహరిస్తూ మంత్రి ధర్మాన తన ప్రసంగం ముగించారు.
తండేంవలసలో..
అనంతరం తండేంవలసలో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని మంత్రి ధర్మాన నిర్వహించి,లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఇరవై రెండేళ్ల కిందట మీ గ్రామాలకు నేను వచ్చినప్పుడు,మీకు ఇచ్చిన హామీ నెరవేర్పులో భాగంగా మీ గ్రామానికి త్రాగు,సాగు నీరు అందించాం. ఆ రోజు తెచ్చిన నీటి కారణంగా మీ పంటలు సమృద్ధిగా పండుతున్నాయి. మీ సామాజిక హోదా కూడా పెరిగింది. విపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికలు వస్తుంటే..పెన్షన్ పెంచి ఇచ్చారు. జగన్ అలా కాదు అధికారంలోకి వచ్చిన రోజు నుంచే ప్రజలకోసం ఆలోచనా చేస్తున్నారు. మాట ఇచ్చి నిలబెట్టుకునే నాయకుడు జగన్. మోసం చేసే నాయకుడు చంద్రబాబు. ప్రజలంతా ఇది గమనించాలి.
తండేవలసలో 498 మందికి వివిధ సేవల ద్వారా ధ్రువీకరణ పత్రాలు జారీ చేశాం. గ్రామంలో ఎటువంటి తగాదాలు లేకుండా ఉండేందుకు సమగ్ర భూ సర్వే చేస్తున్నాం. హద్దు రాళ్లు కూడా వేసి మీ భూమి మీకు ఇస్తున్నాం. ఇందుకు అవసరమైన ఖర్చు ప్రభుత్వమే భరిస్తోంది. గత ప్రభుత్వం మాదిరిగా ఇంటి మేడ మీద మా పార్టీ జెండా కడితేనే పథకాలు అన్న విధంగా నడుచు కోలేదు. పార్టీలు చూసి పథకాలను వర్తింప జేయలేదు. అర్హతే కొలమానంగా చూశాము. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అర్హతనే ప్రామాణికంగా తీసుకుని పథకాలు అందిస్తున్నాం" అని మంత్రి ధర్మాన పేర్కొన్నారు.
అలానే అంపోలు లో 350 మందికి వివిధ సేవల ద్వారా ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు.
రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్ చైర్మన్ అంధవరపు సూరిబాబు, జిల్లా రైతు విభాగం అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ రావు, ఎంపిపి అంబటి నిర్మల, గోండు రఘు రాం, ఎఎంసి చైర్మన్ ముకళ్ల తాత బాబు, రూరల్ మండలం అధ్యకులు చిట్టి జనార్ధన రావు, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ గోండు కృష్ణ, సర్పంచ్లు కంచు రమణమ్మ వసంత, పొన్నన కుర్మరావు, గోండు జయ రాం
పిఎసీఎస్ అధ్యక్షులు గోండు కృష్ణ, , ఎంఆర్వో వెంకటరావు, జన్ని రామారావు, కోణార్క్ శ్రీనివాస్ రావు, ముంజేటి కృష్ణ, చిట్టి రవి కుమార్, పొన్నాన మాధవ్, పీస శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
0 Comments