శ్రీకాకుళం:-చెస్ తో మేథో శక్తి, విజ్ఞాన పరిజ్ఞానం, వ్యూహాత్మకత పెంపొందుతాయని ప్రముఖ సామాజికవేత్త డాక్టర్ సూర శ్రీనివాసరావు అన్నారు. నగరంలోని పిఎన్ కాలనీలో ఉన్న న్యూ సెంట్రల్ స్కూల్లో దివంగత చౌదరి సత్యనారాయణ జయంతిని పురస్కరించుకొని ఏపీ రాష్ట్రస్థాయి చెస్ టోర్నమెంట్ ను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ సూర శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్య తోపాటు క్రీడలు కూడా అవసరమని అన్నారు. క్రీడలు మానసిక, శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తాయని చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక ప్రజాదారణ పొందుతున్న ఆటల్లో చెస్ కూడా ఒకటి అన్నారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుండి చెస్ వంటి క్రీడల పై దృష్టి సారించి తమ మేథో శక్తిని, జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చౌదరి ధనలక్ష్మి, ఏపీ ఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షులు చౌదరి పురుషోత్తం నాయుడు, చౌదరి సతీష్, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ పి జగన్ మోహన్ రావు, సనపల భీమారావు తదితరులు పాల్గొన్నారు.
0 Comments