ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

పిల్లలు సంపూర్ణ వికాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయి.రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద రావు

శ్రీకాకుళం, జూలై 15: జీవన విధానంలో వస్తున్న మార్పులు కారణంగా పిల్లలు మానసిక ఎదుగుదల లేకుండా పోతుందని ఈ తరుణంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసికొని చదువుతో పాటు ఏదైనా క్రీడల్లో విధిగా చేర్పించాలని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. శనివారం శ్రీకాకుళం రూరల్ మండలం ఒప్పంగి గ్రామంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఉషూ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒత్తిడితో కూడిన విద్యను అందించే పనిలో తల్లిదండ్రులు పడి పిల్లలు సంపూర్ణ, మానసిక ఎదుగుదలను మరిచిపోతున్నారని ఇది మంచిది కాదన్నారు. పూర్వ కాలంలో చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం లో పిల్లలు చదువులు ఉండేవని నేడు అవి కానరావని ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపి పిల్లలకు ఇష్టమైన క్రీడల్లో ప్రావీణ్యం పొందాలని మంత్రి ఆకాక్షించారు. అనేక కార్పోరేట్ పాఠశాలలు పిల్లలకు బందీలుగా మార్చి విద్యను అందిస్తున్నాయని వీటివల్ల మానసిక ఎదుగుదల లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర స్థాయి ఉషూ క్రీడలు శ్రీకాకుళంలో నిర్వహించడం ఎంతో ఆనందదాయకంగా ఉందని, ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులను మంత్రి ధర్మాన ప్రసాదరావు అభినందించారు. రెండురోజుల పాటు జరగనున్న ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు గెలుపు ఓటములతో పనిలేకుండా పాల్గొనే అవకాశం కలగటం ఆనందంగా భావించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల నుండి 285 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉషూ క్రీడల ప్రారంభ కార్యక్రమంలో ఉషూ అసోషియేషన్ ప్రతినిధులు రెడ్డి శివకుమార్, కొమర భాస్కరరావు, పి.క్రిష్నమ్ నాయుడు, వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు జి.ఇందిరాప్రసాద్, ఎస్.జోగినాయుడు, బి.వి.రవిసంకర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.సురేఖ, శ్రీకాకుళం జిల్లా పి.ఈ.టి.ల సంఘం అధ్యక్షుడు ఎం.వి.రమణ, రాష్ట్ర కళింగ వైశ్య అధ్యక్షుడు కోనార్క్ శ్రీనివాస్, ఒప్పంగి గ్రామం ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా నిర్వాహకులు చక్కని వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

Post a Comment

0 Comments