శ్రీకాకుళం.ఎల్బిఎస్ కాలనీ సచివాలయం పరిధిలోనీ లబ్దిదారులతో జగనన్న సురక్ష కార్యక్రమంలో రెవెన్యూ మంత్రి శ్రీ ధర్మాన ప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజలు అందరికి అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడం, అర్హత ఉన్న వారికి ప్రభుత్వ పథకాలు అందుకోవాలంటే అవసరమైన వివిధ ధృవీకరణ పత్రాలు గుర్తించి, ఉచితంగా ఇచ్చేందుకు జగనన్న సురక్ష కార్యక్రమం ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అర్హత కలిగిన ప్రతి ఒక పేద వాడికి ప్రభుత్వ పథకాలు అందించే విధంగా చేస్తున్నాము
పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంచుతున్నాం.
మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిపించండి పధకాలు ఇంకా అమలు చేస్తామన్నారు. నాలుగేళ్ళ పాలనలో పరిపాలనను వార్డు లోకే తీసుకు వచ్చాం. ఇపుడు నేరుగా మీ తలుపు కొట్టి మరి సురక్ష కార్యక్రమంలో ఆదచేస్తున్నాము. ఈ నాలుగేళ్ళ పాలనలో మేము ఏమి చేశామో చెప్పడానికి వచ్చాము. దేశంలో అన్ని రాష్ట్రాలు ఆంద్రప్రదేశ్ ను ఆదర్శంగా తీసుకుంటున్నారు, ప్రజల స్థితి గతులు మారాలి అంటే విద్య ఒక్కటే ఆయుధం అని నమ్మి, విద్య వ్యవస్థలో సమూల మార్పులు తీసుకు వచ్చి, మన విద్యార్థులు ప్రపంచం తో పోటీ పడేలా అవకాశాలు కలిపిస్తున్నాం. వయసులో చిన్న వాడు అయిన జగన్మోహన్ రెడ్డి అలోచన చాలా గొప్పది.
అప్పుడు డబ్బు కొంత మంది పెత్తం దారుల జోబిలో ఉండేది, ఇపుడు బలహీనులు అండగా ఉండేందుకు నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తున్నాం.
వారు చేయలేని మంచి, వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీఎం జగన్ అధ్యక్షతన చేస్తుంటే.. ప్రతిపక్షం
రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాం అంటా, పధకాలు వృథా అని అంటున్నారు, అంటే వారి దృష్టిలో పేద ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం తప్పా ? వారిని బిడ్డలు సంపన్నుల బిడ్డలు లానే విద్య ఫలాలు అందాలి అని చేస్తున్న ప్రయత్నం తప్పా? ఎన్ని తరాలు గడించిన ఇళ్లు లేకుండానే ఉన్న కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేర్చడం సర్వ నాశనం అంటారా ?
నాలుగేళ్ళ లో మాట్లాడని చంద్రబాబు ఎన్నికలు ముందు రాజమండ్రి సభలో నేను ఉన్నాను మళ్ళీ నన్ను గెలిపిస్తే మూడు రెట్లు ఇస్తాం అన్నారు, 14 ఏళ్ళు ముఖ్య మంత్రిగా ఉన్న చంద్రబాబు, ఇప్పుడేం చేయగలడు. చంద్రబాబు కి స్థిరమైన అభిప్రాయం లేదు అని ప్రజలకు తెలుసు. స్పష్టంగా ఉండే లక్ష్యం లేని చంద్రబాబు మాట చెప్పి కాలక్షేపం చేస్తాడు..175 స్థానాల్లో వైస్సార్సీపీ గెలుస్తోందన్నారు
0 Comments