ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వానికి కనికరం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
లక్షరూపాయలు ఇచ్చినా మున్సిపల్ కార్మికులు చేసే పనిని ఇతరులెవ్వరూ చేయలేరని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపాలిటీలో ఏ ఒక్క కార్మికునికి పర్మనెంట్ చేయలేదని విమర్శించారు. మున్సిపల్ కార్మికులు తమ ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నా కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారిచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులను శాశ్వత స్వభావం కలిగిన మున్సిపల్ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని, అవుట్సోర్సింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, సిపిఎస్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 010 ద్వారా జీతాలు చెల్లించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్లు అమలు చేయాలని, ఇంజనీరింగ్ కార్మికులకు హెల్త్ మరియు రిస్క్ ఎలవేన్స్, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హెల్త్ అలవెన్స్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. క్లాప్ ఆటో డ్రైవర్లకు 18,500 వేతనం చెల్లించాలని, అన్ని విభాగాల్లోని కార్మికులకు రక్షణ పరికరాలు పనిముట్లు భద్రతా సౌకర్యాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహాసభలలో సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సి. హెచ్ అమ్మన్నాయుడు పి తేజేశ్వరరావు కార్యదర్శి ఎన్వి రమణ జిల్లా కోశాధికారి సత్యనారాయణ హాజరై మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ ఫెడరేషన్ నాయకులు పాల్గొన్నారు .
*జిల్లా నూతన కమిటీ*
16 మందితో ఎన్నుకోవడం జరిగింది గౌరవాధ్యక్షులుగా పి.తేజేశ్వరరావు, అధ్యక్షులు రమేష్ పట్నాయక్, ఉపాధ్యక్షులుగా అరుగుల. గణేష్, సిహెచ్.మురుగన్, ఏ.రాజేశ్వరి, ప్రధాన కార్యదర్శిగా ఎన్. బలరాం, సహాయ కార్యదర్శులుగా బి. కూర్మారావు, కళ్యాణ.రాజు కోశాధికారిగా టి.సంతోష్, కమిటీ సభ్యులుగా గంగాధర్ రథో, ఎమ్. రవి, జే.వాసు,డి.యుగంధర్, కే.రాజు,ఏ.రాము, ఎల్.రవి లను మహాసభ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది
0 Comments