ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపేట

*వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపేట*

*ప్రతి వ్యక్తికి సంపూర్ణ ఆరోగ్యవంతునిగా చూడటమే సీఎం లక్ష్యం*

*అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభోత్సవంలో సభాపతి తమ్మినేని సీతారాం*

 శ్రీకాకుళం, (ఆముదాలవలస), జూలై 6 : రాష్ట్రంలో ప్రతి సగటు పౌరుడు ఆరోగ్యవంతమైన జీవనం కొనసాగించాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అభిమతమని సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.గురువారం మెట్టెక్కివలసలో రూ.1.03 కోట్ల అంచనాలతో నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్యం,విద్య, సంక్షేమం, వ్యవసాయం 4 రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గ్రామాల్లో వెల్నెస్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.తక్షణ ప్రాథమిక వైద్యం వీటిల్లో లభిస్తున్నాయన్నారు. ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం ద్వారా ప్రతి గ్రామంలో మొబైల్ వైద్యం కల్పించిన ఘనత వైసీపీ సర్కార్ కే దక్కిందన్నారు.వీటి ద్వారా పలు వ్యాధులకు సంబంధించిన నిపుణులు వైద్య సేవలు అందిస్తున్నారన్నారు.వ్యాధులను గుర్తించడం, వాటికి సరైన పద్ధతిలో వైద్యాన్ని అందించడం లక్ష్యంగా రోగ నివారణకు ఖరీదైన మందులు అందివ్వటం జరుగుతుందన్నారు. వైద్యరంగంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 108,104, ఆరోగ్యశ్రీ వంటివి అట్టడుగు వర్గాల ప్రజానీకానికి బాసటగా నిలిచాయన్నారు. తండ్రి యొక్క ఆశయాలను తనయుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారన్నారు. కార్పొరేట్,ప్రైవేటు ఆసుపత్రులకు దీటుగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ వైద్యశాలలలో ఓపి పెరిగిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఏర్పాటుకు ముఖ్యమంత్రి సంకల్పించారన్నారు. ఈ మేరకు వీటిని నిర్మాణానికి అవసరమయ్యే పాలనపరమైన అనుమతులు సాధించేందుకు కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా బుధవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి అనుమతులు మంజూరుకు చొరవ తీసుకోవాలని విన్నవించినట్లు తెలిపారు. తన నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో విద్య, వైద్యం కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు తెలిపారు. అణగారిన వర్గాల ప్రజానీకానికి అందుబాటులో ఉండే విధంగా పీహెచ్సీలు, సిహెచ్సిలు ఏర్పాటుకు చర్యలు చేపట్టానన్నారు. వీటిలో కొన్నింటిని అప్గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు. అర్బన్ హెల్త్ సెంటర్లలో అన్ని రకాల వైద్య సేవలు కల్పించేందుకు చొరవ చూపాలని వైద్యులను సూచించారు.ఓపిని పెంచాలని కోరారు. పరిసర ప్రజానీకం వీటిలో వైద్య సేవలను విరివిగా వినియోగించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అర్ డి ఓ బొడ్డేపల్లి శాంతి, డిప్యూటీ డి యం & హెచ్ ఓ అనురాధ,మున్సిపల్ కమిషనర్ రవి సుధాకర్, ఈ ఓ సుగునకర్,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బొడ్డేపల్లి రమేష్ కుమార్, వైస్ ఫ్లోర్ లీడర్ అల్లం శెట్టి ఉమామహేశ్వరరావు, దుంపల శ్యామలరావు,బొడ్డేపల్లి అజంతా కుమారి, జె కె వెంక బాబు, పోదిలాపు తిరుపతిరావు,సాదు చిరంజీవి, సువ్వారి వెంకటరమణ, కుప్పిలి సత్యనారాయణ, బొడ్డేపల్లి రాజు, పొడుగు శ్రీను,పొన్నాడ చిన్నారావు, బొడ్డేపల్లి రవి,విజయ్, మామిడి రమేష్ కుమార్ తదితర వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments