ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

10న డీ వార్మింగ్ డే. 17న మాప్ అప్ డే.

*విద్యార్థులందరికి మాత్రలు పక్కాగా వేయాలి*
*విద్యార్థుల్లో మాత్రల పట్ల అపోహలు తొలగించాలి*

*10న డీ వార్మింగ్ డే*
*17న మాప్ అప్ డే*
 
*పత్రికా సమావేశంలో వెల్లడించిన జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా.మీనాక్షి*

శ్రీకాకుళం,ఆగస్ట్ 09 : జిల్లాలోని అన్ని అంగన్వాడీ, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లోని విద్యార్థులకు నులిపురుగుల నిర్మూలన మాత్రలు పక్కాగా వేయించెందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయన్నారు.

ఈ మాత్రలు తీసుకోవడం వలన ఎటువంటి దుష్ప్రభావాలు ఉండబోవనే అపోహను విద్యార్థుల్లో అపోహను తొలగించాలన్నారు. తద్వారా ప్రతి విద్యార్థి మాత్రలు వేసుకునేందుకు ముందుకువస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థి మాత్రను వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓలు, ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్చంద సేవా సంఘాలు భాగస్వాములై విజయవంతం చేయాలని తెలిపారు. జిల్లాలో ఈ నెల 10న డీ-వార్మింగ్ డే, 17న మాప్ అప్ డే కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంపై జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి డా. మీనాక్షి పత్రికా సమావేశం లో మాట్లాడుతూ ఆగస్టు10 డీ-వార్మింగ్ రోజున జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలలు,జూనియర్ కళాశాలలోని విద్యార్థులకు డీ-వార్మింగ్ మాత్రలు (ఆల్బండ జోల్ 400 Mg) తప్పనిసరిగా నమిలించి తినిపించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో 1నుండి 2ఏళ్ల వరకు సగం మాత్ర, 3 నుండి 19ఏళ్ల వరకు గల విద్యార్థులతో పాటు పాఠశాలలకు వెళ్లని పిల్లలకు అంగన్వాడీ కార్యకర్తలు ద్వారా మాత్రలు వేయించాలన్నారు. ప్రతి పాఠశాలలో ఉదయం 08.00గం.ల నుండి సాయంత్రం 05.00గం.ల వరకు నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. మధ్యాహ్న భోజనం తరువాత ప్రతి విద్యార్థికి ఒక మాత్రను వైద్య ఆరోగ్య శాఖ, విద్యా శాఖ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తల సమన్వయంతో నమిలి తినిపించాలని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థికి చేతులు పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించాలని అన్నారు.

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న, బడికి వేళ్ళని పిల్లలు, అంగన్వాడి కేంద్రాల్లో ఉన్న మొత్తం 4,44,162 మందికి మాత్రలు పంపిణీ చేయబడ్డాయని అన్నారు. ఈ మాత్రలు వలన ఎటువంటి దుష్ప్రభావాలు ఉండబోవని చెప్పారు. ప్రతి పాఠశాలకు ఒక ఆరోగ్య సిబ్బందిని పర్యవేక్షకుడిగా నియమించినట్లు తెలిపారు. ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, స్వచ్చంద సేవా సంఘాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు.

ఈ పత్రికా సమావేశంలో రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం జిల్లా సమన్వయకర్త డా.సి.పి.శ్రీదేవి, జిల్లా మాస్ మీడియాధికారి పైడి వెంకటరమణ, ప్రోగ్రాం మేనేజర్ అప్పలనాయుడు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments