గార:- తెలుగుదేశం పార్టీ నేతలు అవినీతి చేసారన్న కారణంతో ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులను వైకాపా ప్రభుత్వం అర్ధాంతరంగా ఆపేసిందని బిజెపి శ్రీకాకుళం అసెంబ్లీ ఇంచార్జ్ చల్లా వెంకటేశ్వర రావు ఆరోపించారు. శ్రీకాకుళం అసెంబ్లీ బిజెపి నాయకులతో కలిసి గార మండలంలోని గార ఎత్తిపోతల పాజెక్తును, వంశధార నదిపై గార వద్ద నిర్మిస్తున్న గార-వనితమండలం రోడ్ బ్రిడ్జిని మరోసారి పరిశీలించారు. 2020 అక్టోబరులో పరిశీలించినపుడు ఏ స్థితిలో ఉన్నాయో అదే స్థితిలో ఉన్నాయని, గార-వనితమండలం బ్రిడ్జి పనులు ప్రారంభించినా నత్తనడకన సాగుతున్నాయని చల్లా వెంకటేశ్వర రావు ఆరోపించారు. ఈ నాలుగున్నరేళ్ళలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ఈ ప్రాజెక్టులపై స్పందించలేదని, వారి హయాంలో ఏ విధమైన అవినీతి జరగకపోతే, వారు ఎందుకు దీనిపై పోరాటం చేయడంలేదని ప్రశ్నించారు. పంటలు ఎండిపోతుంటే, నష్టపరిహారం ఇప్పిస్తామని వైకాపా, తెలుగుదేశం పార్టీ నేతలు రైతులను కలుస్తున్నారని, లిఫ్ట్ ఇర్రిగేషన్ ప్రాజెక్టు పూర్తిచేస్తే ఈ పరిస్థితి రాదుకదా అని అన్నారు. లిఫ్ట్ ఇర్రిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేయమని 2021 మార్చిలో జిల్లా కలెక్టరుకు వినతిపత్రం ఇచ్చినా కూడా కేవలం కోటి రూపాయల నిధులు విడుదల చేయలేని పరిస్థితిలో వైకాపా ప్రభుత్వం ఉందని చల్లా వెంకటేశ్వర రావు విమర్శించారు. ఎన్నికలకు ముందే ఈ రెండు ప్రాజెక్టులను పూర్తిచేయమని అధికారులను, ప్రభుతాన్ని కోరుతున్నట్లుగా తెలిపారు.
ఈ ప్రాజెక్టులను పరిశీలించిన వారిలో చల్లా వెంకటేశ్వర రావుతో పాటు సాధు కిరణ్ కుమార్, రావాడ పురుషోత్తం, వాన సోమేశ్వర రావు, భైరి అప్పారావు, మూకళ్ళ లక్ష్మినారాయణ తదితరులు ఉన్నారు.
0 Comments