పోలాకి : వ్యవసాయంలో డ్రోన్ ల సాంకేతిక సహాయాన్ని తీసుకుని సాగును సులభతరం చేసే కార్యక్రమాన్ని తన స్వగ్రామం మబుగాం నుంచి మాజీ డిప్యూటీ సీఎం, సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణ దాస్ ప్రారంభించారు.
డ్రోన్ ల ద్వారా పురుగు మందులు పిచికారీ చేయడానికే పరిమితం కాకుండా.. విత్తనాలు, ఎరువులు చల్లడం.. పంటలో చీడపీడలు, తెగుళ్లను, పూత, కొత పరిస్థితిని గుర్తించేలా ఫొటోలు తీయడం.. దిగుబడి ఏ మేరకు వచ్చే అవకాశం ఉందనే అంచనా వేసేందుకు వీలైన సమాచారం సేకరించడానికి వీలుగా డ్రోన్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందనీ ఈ సందర్భంగా ఆయన అన్నారు. డ్రోన్లను సరైన తీరులో వినియోగించడం ద్వారా.. సాగులో పురుగు మందులు, ఎరువుల వృధాను అరికట్టవచ్చని, కూలీల కొరతకు చెక్ పెట్టవచ్చని ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. సాంకేతికతకు అనుగుణంగా రైతులు దశలవారీగా ఈ నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలని కృష్ణ దాస్ పేర్కొన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ కే.శ్రీధర్, వ్యవసాయ సలహా మండల అధ్యక్షులు శిమ్మ నేతాజీ, ముద్దాడ భైరాగి నాయుడు, పలువురు వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.
0 Comments