ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

టిడిపి నేతలే ఇసకాసురులు - Ex Dy CM ధర్మాన కృష్ణదాస్

టిడిపి నేతలే ఇసకాసురులు 
- ఉచితం పేరుతో రూ.4 వేల కోట్లు దోచేశారు
- అడ్డుకున్న అధికారులను కొట్టిన చరిత్రా వాళ్లదే
- వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్

నరసన్నపేట, ఆగస్టు 31:ప్రజలకు అత్యంత పారదర్శకంగా, అందుబాటు ధరలో ఇసుకను అందజేస్తున్న తమ ప్రభుత్వంపై టిడిపి నేతలు అక్కసు వెళ్ళగక్కుతున్నారని వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. గురువారం ఉదయం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ టిడిపి హయాంలో ఆ పార్టీ నాయకులు నాలుగు వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. వారి హయాంలో ఇసుక ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో చెప్పలేని పరిస్థితి ఉందని, అసలైన ఇసకాసురులు వారేనని విమర్శించారు. అక్రమ తవ్వకాలను అడ్డుకున్న వనజాక్షి అనే ఎమ్మార్వో ను జుట్టు పట్టుకొని కొట్టిన చరిత్ర వారికే ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా తమ ప్రభుత్వం ఇసుక టెండర్ల ప్రక్రియను నిర్వహించి ఏటా ప్రభుత్వానికి రూ.760 కోట్ల ఆదాయాన్ని తీసుకు వస్తున్నదని స్పష్టం చేశారు. ప్రత్యేకమైన టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేసి ఇసుక విధానంలో ఎలాంటి లోపాలు ఉన్నా ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసే వ్యవస్థను తీసుకొచ్చిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పారు. సెబ్ లాంటి నిఘా వ్యవస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా ఒక ఐపీఎస్ అధికారిని నియమించి ఎక్కడా అక్రమాలు జరగకుండా చూస్తున్న తమ ప్రభుత్వంపై నిందారోపణలు చేయడం మానుకోవాలని కృష్ణదాస్ హితవు పలికారు.

Post a Comment

0 Comments