ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

బూటకపు కండువాలు వేయడం మానుకోండి.తెలుగుదేశం పార్టీ కి వైసిపి పార్టీ నాయకుల హితవు

నరసన్నపేట: దేవుడి గుడికి వచ్చిన తటస్థులను... దారిన పోయే వైసీపీ మద్దతుదారులకు బలవంతంగా తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి.. వైసీపీ పార్టీలో విసుగు చెంది తెలుగుదేశం పార్టీలోకి వచ్చారని అంటూ బూటకపు చేరికల ప్రచారాలను తెలుగు దేశం పార్టీ నాయకులు మానుకోవాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు హితవు పలికారు. గురువారం సాయంత్రం నరసన్నపేట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో *సుడా చైర్మన్ కోరాడ చంద్రభూషణ గుప్త, జెడ్పిటిసి చింతు అన్నపూర్ణ రామారావు, మేజర్ పంచాయతీ సర్పంచ్ బురెల్ల శంకర్, వట్టణ వైసీపీ అధ్యక్షుడు పోట్నూరు సాయి ప్రసాద్, మండల పరిషత్ విప్ వైశ్యరాజు కేశవరాజు, వార్డు సభ్యులు బంకుపల్లి లోకనాధ శర్మ, జిల్లా పార్టీ కార్యనిర్వహణ సభ్యులు కోటిపల్లి శ్రీనివాస్ లు* విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అబద్ధపు ప్రచారాలను ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ
నరసన్నపేట పట్టణంలో తెలుగు దేశం పార్టీ నిర్వహించిన యువగళం 200 రోజు కార్యక్రమంలో భాగంగా ఓ ఇద్దరు వైసీపీ కార్యకర్తలు అంటూ.. సంబంధంలేని వారిని బలవంతంగా తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి... వీరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో విసిగిపోయి వచ్చారని సోషల్ మీడియాలో అబద్దపు ప్రచారం చేసారని వీరు దుయ్యబట్టారు. ఈలోగా స్థానిక వైసీపీ నాయకులు ఆరా తీయగా... అటువైపు వెల్లిన తమను బలవంతంగా కండువాలు కప్పేశారని వారు... అందులో ఒకరు తాను దాసన్న వీరాభిమానినని చెప్పారని వీరన్నారు. మరోకరు తనకు పార్టీలతో ఎటువంటి సంబంధం లేదని అన్ని పార్టీలు నాకు ఒకటేనని చెప్పుకొచ్చారని వీరు అన్నారు. మొత్తంగా తెలుగుదేశం పార్టీ ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేసి పబ్బం గడుపుకోవాలని చూస్తుందని వీరు చెప్పుకొచ్చారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఇకనైనా మానుకోవాలని.. బూటకపు చేరికలు పేరుతో ప్రజలను మభ్య పెట్టొద్దని వీరు తెలుగుదేశం పార్టీ నాయకులక హితవు పలికారు..

Post a Comment

0 Comments