ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

చదువుకున్న పాఠశాల రుణం తీర్చుకున్న ఎన్ఆర్ఐ మురళి

విద్యాబుద్ధులు నేర్చుకున్న పాఠశాల అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందిస్తానని ఇండోనేషియా దేశంలో స్థిరపడిన గేదెల మురళి తెలిపారు. మంగళవారం సారవకోట మండలం చీడిపూడి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్ర దినోత్సవాన్ని పరిష్కరించుకొని విద్యార్థులకు సుమారు 30 వేల రూపాయలతో బహుమతులతో పాటు కంప్యూటర్ కు యుపిఎస్ కూడా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదే పాఠశాలలో తాను ప్రాథమిక విద్య ఆభ్యసించడం జరిగిందని ఈ దిశగానే తన తల్లి గేదెల జయలక్ష్మి, అత్తమామలు కోర్ను ఆనందరావు, సుగుణ, సౌజన్య వారి జ్ఞాపకార్థం వితరణ అందజేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మురళి భార్య లావణ్య, ప్రమీల రాణి, ఉషారాణి, సుజనా , సుమన, ప్రధానోపాధ్యాయులు పాటోజు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments