ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణానికి రూ.12కోట్లు.ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు కృష్ణ దాస్

శ్రీకాకుళం:-కోడి రామ్మూర్తి స్టేడియం పునర్నిర్మాణానికి అవసరమైన రూ.12 కోట్లను మంజూరు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఒక ప్రకటన విడుదల చేస్తూ స్టేడియం నిర్మాణం కోసం రూ. 12 కోట్లు మంజూరు చేస్తూ జీఓ 202 పేరుతో ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసిందని, పరిపాలన పరమైన అనుమతులు రావడంతో, వీలైనంత త్వరగా టెండర్లు పిలిచి నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత యంత్రాంగాన్ని కోరినట్టు ఈ సందర్భంగా తెలిపారు. గత పాలకులు ముందు చూపు లేకుండా చేసిన తప్పిదం, తీవ్ర నిర్లక్ష్యమే స్టేడియం నిర్మాణం ఆలస్యం కావడానికి కారణమని అన్నారు. స్టేడియం నిర్మాణానికి తక్షణమే నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనెల 8వ తేదీ ఆదివారం ఉదయం ఏడు గంటలకు మూర్తి స్టేడియం ఆవరణలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఆరోజు ఉదయం ఒలింపిక్ అసోసియేషన్, అన్ని క్రీడా సంఘాలు, వాకర్స్ క్లబ్లు, పట్టణ ప్రముఖులతో కలిసి సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. క్రీడా ప్రేమికులంతా ఈ కార్యక్రమానికి తప్పక హాజరుకావాలని కృష్ణ దాస్ పిలుపునిచ్చారు.

Post a Comment

0 Comments