విజయనగరం:-గాంధీ జయంతి పురస్కరించుకొని విజయనగరంలోని గాంధీ విగ్రహాన్ని జేడీ లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ముందుగా ఆయనకు విజయనగరం సావిత్రిభాయ్ పూలే మహిళా సంఘం అధ్యక్షురాలు జి. రమణమ్మ,ఘనంగా స్వాగతం పలికారు. విగ్రహ ఆవిష్కరణ అనంతరము తమ సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలను గూర్చి లక్ష్మీనారాయణ కు రమణమ్మ వివరించారు. సావిత్రిబాయి పూలే మహిళా సంఘము చేస్తున్న సేవలను ఆయన కొనియాడారు. అధ్యక్షురాలు రమణమ్మను అభినందించారు. మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ప్రతి ఒక్కరూ గాంధీజీ ఆశయాలను కొనసాగించాలని కోరారు.
0 Comments