నరసన్నపేట: నరసన్నపేట లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి పురస్కరించుకొని సోమవారం మారుతినగర్ 4 వ వీధిలో మొక్కలునాటే కార్యక్రమం నిర్వహించమని లయన్స్ క్లబ్ అధ్యక్షులు సదాశివుని కృష్ణ తెలిపారు. గాంధీజీ జయంతి రోజు ప్రతి ఒక్కరూ మంచి కార్యక్రమానికి నాంది పలకాలని కోరారు.మానవ మనుగడకు పచ్చని చెట్లే జీవనాధారం అన్నారు. కావున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి వి. నాగరాజు, కోశాధికారి పి.రమేష్, జెడ్ వి సి రంగనాథ్, ప్రతినిధులు బి. బాలకృష్ణ, కోట్ని బుజ్జి తూముల శ్రీను, కె. సాయిరాం,రమణ సాహు, తదితరులు పాల్గొన్నారు.
0 Comments