ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మ జ్యోతిరావు పూలే. మంత్రి ధర్మాన

శ్రీకాకుళం, నవంబర్ 28: బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల ఆశాదీప్తి మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతిని పుర‌స్క‌రించుకుని మంత్రి ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు నివాళుల‌ర్పించారు. పెద్ద‌పాడులోని మంత్రి క్యాంప్‌ కార్యాలయం(పేప‌ర్ సిటీ)లో ఏర్పాటు చేసిన  కార్య‌క్ర‌మం లో ఆయన చిత్రపటానికి పూల మాల‌లు వేసి అంజ‌లి ఘటించారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి ధర్మాన మాట్లాడుతూ..మ‌న దేశాన బ్రిటిష్ పా లన ఉన్న రోజుల్లో దేశం ప్రజలందరూ..చ‌దువుకోవాలి,అంద‌రికీ విద్య అందాలి,వారికి అన్ని హక్కులు దక్కాలి అని ఆశించారు. పోరాడారు. వెనుకబడిన తరగతులు అభ్యున్న‌తి సాధించాల‌ని, అలానే పేద,ధ‌నిక వ‌ర్గాల మ‌ధ్య అంతరాలు తగ్గాల‌ని కృషి చేశారు. స్త్రీ విద్య‌ను ఎంత‌గానో ప్రోత్స‌హించారు. ఆయ‌న భార్య సావిత్రీ బాయి పూలే అని కృషిచేశారు. వారు వేసిన పునాదు లు మీదనే  నేడు అన్ని రాష్ట్రాలూ నాణ్య‌మైన విద్య అందించేందుకు ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేస్తూ ఉన్నాయి.

ముఖ్యంగా అన్ని వ‌ర్గాల‌కూ విద్యావ‌కా శాలు ద‌క్కుతున్నాయి. విద్య ద్వారా సమాజంలో అంతరాలు తగ్గుతాయి అనే స్థితికి రాగలుగుతు న్నాం అంటే ఇందుకు కారణం పూలే వేసిన పునాదులు. వాటి మీదనే భారత దేశంలోని వెనుక బడిన తరగతుల సమాజం పెద్ద యెత్తున అభివృద్ధి చెందింది. విద్య‌,ఉద్యోగ అవ‌కాశాలు అందుకుంటున్న‌ది. పూలే స్ఫూర్తితోనే రాష్ట్రంలో వైఎస్ జ‌గ‌న్ నేతృత్వాన పాల‌న సాగుతోంది. బ‌డుగు,బ‌ల‌హీన వర్గాల సాధికార‌తే ధ్యేయంగా సామాజిక ఉన్న‌తే ధ్యేయంగా ఇవాళ మేం అంతా ప‌నిచేస్తున్నాం. అర్హ‌తే ప్రామాణికంగా ప‌థ‌కాలు అందిస్తున్నాం. అలానే విద్య‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చి సంబంధిత రంగానికి ఎక్కువ నిధులు కేటాయిస్తూ ఉన్నాం.  ఇవాళ సామాజిక న్యాయం సాధ్యం అవుతోంది మ‌న రాష్ట్రంలోనే.. అని మంత్రి ప్రసాదరావు పేర్కోన్నారు.

Post a Comment

0 Comments