ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే.జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్

శ్రీకాకుళం, నవంబర్ 28 : దేశంలో మహాత్మా బిరుదు పొందిన మహానుభావులు ఇద్దరేనని, ఒకరు జ్యోతిరావు పూలే కాగా, మరొకరు జాతిపిత గాంధీ అని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ అభివర్ణించారు. వారికి లభించిన బిరుదులే వారి గొప్పతనానికి నిదర్శమని కొనియాడారు. మహాత్మా జ్యోతిరావు పూలే 133వ వర్ధంతి కార్యక్రమం కలెకరెట్ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ పాల్గొని పూలే చిత్ర పాఠనికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అట్టడుగు, బలహీన వర్గాల ప్రజల పట్ల సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి పూలే అన్నారు. స్త్రీలకు కూడా విద్య అవసరమని గుర్తించి, ఆ కాలంలోనే నిరక్షరాసులైన మహిళలకు విద్యను అందించిన విద్యావేత్త అని ప్రశంసించారు. రైతు విధానం, జాతీయ సమైక్యత అంశాల పట్ల పోరాటం చేసి సభ్య సమాజానికి దిక్సూచిగా మారరన్నారు. దేశంలో ఉన్న విభేదాలపై ఆయన చేసిన అధ్యయనం ఆదర్శనీయమని తెలిపారు. మహారాష్ట్రలో జన్మించిన డా.బి.ఆర్. అంబేద్కర్, జ్యోతీరావు పూలే వంటి మహానుభావులు పుట్టిన ప్రాంతంలో తాను కూడా జన్మించడం గర్వంగా ఉందన్నారు. పూలే ఆలోచనలు, ఆశయాలు స్మరించుకుంటూ , వారిని స్పూర్తిగా తీసుకొని ముందుకువెల్లాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మనం చేసే ప్రతి పని సమాజంలోని చివరి వ్యక్తి వరకు చేరాలని ఆ దిశగా కృషి చేయాలని కలెక్టర్ కోరారు. అపుడే వారికి మనమిచ్చే ఘనమైన నివాళని కలెక్టర్ గుర్తుచేశారు. 

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ ల్, సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా అధికారులు ఆర్.గడ్డెమ్మ, ఇ. అనురాధ, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments