నవంబర్ 30 :భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుస్థిరంగా సుభిక్షంగా ఉంచే శక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి కి మాత్రమే ఉందని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. గురువారం సరుబుజ్జిలి మండలం అన్నం పేట పంచాయతి పరిధిలోని తిమడాం, జంగాలపాడు, మసేనపుట్టి, జె వి పురం, అడ్డురి పేట,బొడ్లపాడు గిరిజన గ్రామలలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతీ ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు సక్రమంగా అందుతున్నాయో లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు అందిన ప్రభుత్వ లబ్దిని సచివాలయ సిబ్బంది తో కలసి వివరించారు. ఎవరికైనా అర్హత ఉండి సంక్షేమ పధకాలు అందక పోతే గ్రామ సచివాలయం ను సంప్రదించాలని సూచించారు ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు.పలువురు పరిష్కారం కాని సమస్యలను స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు.సంబంధిత అధికారులు తో మాట్లాడి అక్కడికక్కడే వాటిని పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ని మళ్ళీ ఆశీర్వదించేందుకు అఖిలాంధ్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రతి గ్రామంలో ఇంటింటికీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ప్రభుత్వ పధకాల లబ్ధిని,కలిగే ప్రయోజనాలను వివరించే బాధ్యత ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త పై ఉందన్నారు.గత నాలుగున్నర ఏళ్లలో మండలం లో ప్రతి గ్రామంలో జరిగిన అభివృద్ధిని ప్రజానీకం ముందు ఉంచేందుకు ఈ కార్యక్రమం దోహద పడిందన్నారు. పథకాల అమలులో మరింత సామర్థ్యాన్ని పెంచేందుకు వీలుగా ప్రజల నుంచి సలహాలు,సూచనలు స్వీకరించడమే లక్ష్యంగా 'గడప గడప కు మన ప్రభుత్వం నిర్వహిస్తున్నామని తెలిపారు.ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు, కార్యక్రమాల పట్ల ప్రజల్లో మరింత అవగాహన, చైతన్యం కల్పించే విధంగా చివరి లబ్దిదారునికి కూడా పథకాలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని వారి నుంచే తెలుసుకునే ప్రయత్నం చేయడం గొప్ప విషయం అన్నారు..సీఎం జగన్ అహర్నిశలు కృషి చేయడం అదే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను గ్రామస్థాయి వరకు తీసుకువెళ్లి సకాలంలో ప్రజలకు అందించేందుకు ప్రభుత్వం ఎనలేని కృషి చేస్తోందని అన్నారు. అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కర్నేన నాగేశ్వరరావు జెడ్పీటీసీ బెజ్జిపురపు రామారావు మండల పార్టీ అధ్యక్షుడు టిట్కో డైరెక్టర్ కండాపు గోవిందరావు, వైస్ ఎంపీపీ కరణం కృష్ణమ నాయుడు బుడుమురు సూర్యారావు మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు మండల సచివాలయాల కోఆర్డినేటర్ గుమ్మడి రాంబాబు స్థానిక నాయకులు కొరికాన శంకర్రావు స్థానిక ఎంపీటీసీ గొండ్రు సుధాకర్ స్థానిక నాయకులు మామిడి ఆదినారాయణ మామిడి కిరణ్ కుమార్ దొర మండల యువజన పార్టీ అధ్యక్షుడు స్థానిక నాయకుడు మామిడి శ్రీనివాసరావు తదితర వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు, అధికారులు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.
0 Comments