శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ప్రముఖ తెలుగు రచయిత శ్రీ గురజాడ అప్పారావు గారి వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముందుగా శ్రీ గురజాడ అప్పారావు గారి చిత్రపటానికి జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి బి.కుమార్ రాజు గారు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి బి.కుమార్ రాజు గారు మాట్లాడుతూ గురజాడ అప్పారావు గారు తన రచనల ద్వారా సాంఘిక పరివర్తనకు ప్రయత్నించిన మహాకవి. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకరు. హేతువాది. 19వ శతాబ్దంలోను, 20 వ శతాబ్ది మొదటి దశకంలోనూ అతను చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. అతను ప్రజలందరికీ అర్థమయ్యే వాడుక భాషలో రచనలు చేసారు. వీరి కన్యాశుల్కము నాటకానికి సాహితీ లోకంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నాటకంలో అతను సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్ప పంతులు మొదలైన పాత్రలు ప్రఖ్యాతి పొందాయి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ లైబ్రేరియన్ వి.వి.జి.ఎస్.శంకరరావు, కె.చిరంజీవులు, ప్రత్యూష, పి.మురళి కృష్ణ, పి.భానుమతి, పి.రామమోహన్, యు.కల్యాణి, మరియు పాఠకులు పాల్గొన్నారు.
0 Comments