నరసన్నపేట, నవంబర్ 27:-ఎచ్చెర్ల లో రేపు నిర్వహించే సామాజిక సాధికార బస్సు యాత్రను విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి, మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లే సదుద్దేశమే సామాజిక సాధికార బస్సు యాత్ర లక్ష్యమని అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు సీఎం వైఎస్ జగన్ ఎంతో మేలు చేస్తున్నారని, వారందరినీ కలుసుకునేందుకు ఈ బస్సు యాత్ర దోహదపడుతుందన్నారు. ఈ యాత్రకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయని, పార్టీ శ్రేణులంతా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చిలకపాలెం లో జరిగే భారీ బహిరంగ సభకు భారీ ఎత్తున జన సమీకరణకు బాధ్యతలు పంచుకోవాలని కృష్ణ దాస్ కోరారు.
0 Comments