ఓటర్ల జాబితా సవరణలో అవకతవకలు జరిగాయంటూ టిడిపి నేతలు గగ్గోలు పెడుతుంటే దొంగే దొంగా.. దొంగా..! అన్నట్లు ఉందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణ దాస్ జిల్లా టిడిపి నేతలపై ఫైర్ అయ్యారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం, ఓటర్ల జాబితాలను తారుమారు చేయడం టిడిపికి అలవాటని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన విమర్శించారు. 'సేవా మిత్ర : యాప్ ఉపయోగించి 2017లో ఆ పార్టీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, లక్షల మంది ఓట్లను తొలగించి, పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందని, దానిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు కూడా విషయాన్ని గుర్తు చేశారు. తాజాగా ఆ పార్టీయే మరోసారి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ, మొబైల్ కు వచ్చే ఓటీపీ లను సైతం అడుగుతున్నారని, ఇవ్వకపోతే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని అన్నారు. బోగస్ ఓట్లు, దొంగ ఓట్ల సంస్కృతి టిడిపి వారిదేనని, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కలిగి ఉండాలన్నదే తమ అభిమతమని, ఆ దిశగా కృషి చేస్తున్న రాష్ట్రంలోని ఎన్నికల యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని కృష్ణదాస్ ఆ ప్రకటనలో చెప్పారు.
0 Comments