శ్రీకాకుళం, నవంబర్ 28: బ్రహ్మస్ అకాడమీ వారు శ్రీకాకుళం జిల్లా గ్రంధాలయ సంస్థకు వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను అందజేయడం జరిగింది. ఈ పుస్తకాలు గ్రంధాలయం నందు వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి అని జిల్లా గ్రంధాలయ కార్యదర్శి కుమార్ రాజా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బ్రహ్మస్ అకాడమీ చైర్మన్ బ్రహ్మానందరెడ్డి తాము వివిధ యూనివర్సిటీలో, డిగ్రీ కళాశాలలో అందజేస్తున్న వన్ రూపీ పర్ డే ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ గురించి అక్కడ వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధులవుతున్న విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. తాము గ్రంథాలయానికి అందజేసిన పుస్తకాలు వారికి ఎంతో ఉపయోగపడతాయని బ్రహ్మాస్ అకాడమీ నేషనల్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ సతీష్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సిబ్బంది ఉపగ్రంధపాలకు లు వి
శంకరరావు, రమణమూర్తి,చిరంజీవిగ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు సన్నద్దులవుతున్న విద్యార్థులు గ్రంథాలయానికి విచ్చేసిన పాఠకులు పాల్గొనడం జరిగింది. చివరగా జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి కుమార్ రాజా బ్రహ్మస్ అకాడమీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
0 Comments