శ్రీకాకుళం, నవంబర్.30. జిల్లాలోని మెడికవర్ హాస్పిటల్ నందు పోలీస్ ఆరోగ్య భద్రత పథకం అందుబాటులోకు వచ్చిందని,జిల్లాలో మొదటిసారి మెడికవర్ కార్పొరేట్ హాస్పిటల్లో పోలిసు సిబ్బందికి నగదు రహిత వైద్య సేవలు అందించనున్నారని జిల్లా ఎస్పీ శ్రీమతి జి.ఆర్.రాధిక తెలిపారు. ఈ మేరకు గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వైద్య శిబిరాని ఎస్పీ ప్రారంభించి ఉచిత వైద్య సేవలు పోలీస్ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మెడికవర్ హాస్పిటల్ హెడ్ డాక్టర్ శ్రీధర్ పోలీస్ సిబ్బందికి అనేక విధాలుగా సహాయపడుతున్నారని అందులో భాగంగానే ఆ హాస్పిటలకు ఆరోగ్య భద్రత స్కీమ్ అందుబాటులోకి వచ్చిందని ఎస్పీ తెలిపారు. ఇందులో భాగంగా ఆ హాస్పిటల్లో మేజర్ చికిత్సలన్నియి అందుబాటులో ఉన్నాయని అత్యవసర పరిస్థితులలో ఇతర జిల్లాలకు వెళ్లి వైద్యం చేయించుకోవాల్సిన అవసరం ఇక మీదట ఉండదని ఎస్పీ పేర్కొన్నారు. నేత్ర వైద్యం,క్యాన్సర్, ప్లాస్టిక్ సర్జరీ, బర్న్స్ వంటివి మినహా అన్ని రకాల వైద్య సదుపాయాలు ఈ హాస్పిటల్లో చికిత్స అందిస్తారని ఆమె తెలిపారు. పోలీస్ సిబ్బంది,వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యం పై దృష్టి సారించాలని, నిత్యం ఎక్సర్సైజ్ తో పాటు,మూడు నెలల వ్యవధిలో వైద్య పరీక్షలు చేయించుకోవాలని ఎస్పీ సూచించారు. ఇందుకోసమే రేపటి నుంచి జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతిరోజు ప్రతి పోలీస్ స్టేషన్ నుండి ఇద్దరు చొప్పున 50 మందికి వైద్య పరీక్షలు చేయించడం జరుగుతుందని, కావున సిబ్బంది ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఎస్పీ ఆకర్షించారు. ఇక్కడ వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి ఎటువంటి ఆరోగ్యపరమైన మేజర్ సమస్యలు ఉంటే మెడికవర్ హాస్పిటల్ నందు చికిత్స అందిస్తారని, వైద్య పరీక్షల్లో కూడా అక్కడ 30 శాతం డిస్కౌంట్ ఇస్తారని ఎస్పీ తెలిపారు. అత్యవసర పరిస్థితిలో ఎటువంటి అలసత్వం లేకుండా తక్షణమే వైద్య సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్యులను ఎస్పీ కోరారు.
డా. అనిరుద్ మాట్లాడుతూ కార్డియాలజీ సమస్యపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలన్నారు.ఆవేశము,వీక్నెస్, కళ్ళు తిరగడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు తక్షణమే దగ్గర్లో గల వైద్యులకు చూపించాలని తెలిపారు. మా హాస్పటల్లో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, పౌష్టికరమైన ఆహారం తీసుకుంటు, మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలని ఆయన సూచించారు.
డా. సాగారిక మాట్లాడుతూ హాస్పిటల్లో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంటాయని సిబ్బందికి ఎటువంటి అసౌకర్యం లేకుండా వైద్యం అందిస్తామని తెలిపారు. అదే విధంగా వైద్య పరీక్షల్లో కూడా కొంత శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందన్నారు.
అనంతరం జిల్లా ఎస్పీ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి సిబ్బందికి అందించునున్న వైద్య పరీక్షలు పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఆదనపు ఎస్పీలు టిపి విఠలేశ్వర్, జె. తిప్పే స్వామి, మెడికవర్ హాస్పిటల్ వైద్యులు
అనిరుద్ పైడి,సాగారిక, కోటీశ్వరరావు, మూర్తి,పోలీసు యానిట్ డాక్టర్ సి హెచ్ విజయ కుమార్, ఏవో సిహెచ్ గోపీనాథ్, ఏఆర్. డిఎస్పీ వి.ఎస్.వాసన్, ఆర్ ఐ ఉమా మహేష్,పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
0 Comments