*18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలి*
*జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్*
శ్రీకాకుళం, డిసెంబర్ 01:- 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఓటు హక్కు కలిగి ఉండాలనే దృశ్యా, డిసెంబర్ 2,3 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం అని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు.
ప్రధాన ఎన్నికల అధికారి వారి ఆదేశాల ననుసరించి, ఈ నెల అనగా డిసెంబర్ 2,3 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ రెండు రోజులు ప్రతీ పోలింగ్ బూత్ వద్ద ఉదయం 10.00 గంటల నుండి సాయంత్ర 5.00 గంటలవరకు బిఎల్ఓ లు అందుబాటులో ఉంటారని, ఈ అవకాశం ప్రతీ ఒక్కరు వినియోగించు కోవాలన్నారు. ఇందు నిమిత్తం సంబంధిత ఇఆర్ఓ లు విస్తృతంగా ప్రచారం నిర్వహించి 18 సంవత్సరాల నిండిన ప్రతీ ఒక్కరు ఓటు పొందేలా చర్యలు చేపట్టాలన్నారు.
0 Comments