ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ఆరోగ్యకర సమాజం కోసం ఆడుదాం ఆంధ్రా. కలెక్టర్

శ్రీకాకుళం, డిసెంబర్ 1 : యువతలో క్రీడా­స్ఫూర్తిని పెంపొందించేందుకు, మరోవైపు ఆరోగ్యకర సమాజాన్ని కాంక్షిస్తూ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి రూపకల్పన చేసిందని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. డిసెంబర్ 15 నుంచి 2024 ఫిబ్రవరి 3 వరకు నిర్వహించనున్న 51 రోజుల మెగా స్పోర్ట్ ఈవెంట్ 'ఆడుదాం ఆంధ్రా'కు జిల్లా స్థాయిలో సన్నద్ధతపై ఆయన అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖో-ఖో వంటి క్రీడా పోటీలను నిర్వహిస్తోందని 15 ఏళ్లు పైబడిన వారు పాల్గొనవచ్చన్నారు. 

గ్రామ స్థాయిలో పాల్గొని గెలుపొందిన వారికి మండల స్థాయిలో, ఆ తర్వాత నియోజకవర్గం, జిల్లా చివరిగా రాష్ట్ర స్థాయిలలో పాల్గొనే అవకాశం ఉంటుందని, విజేతకు నగదు బహుమతులు ఉంటాయని, పోటీల్లో పాల్గొన లేని వారి కోసం యోగా, రన్నింగ్ మారథాన్‌లు నిర్వహిస్తారని, క్రీడాకారులకు అవసరమైన కిట్లను సంబంధిత సచివాలయ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచి, అందుకు అనుగుణంగా క్రీడా మైదానాలను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయిలో ఎంపీడీఓలు, నియోజకవర్గ స్థాయిలో ఆర్డీఓలు, జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు కార్యక్రమాలకు చైర్మన్‌లుగా వ్యవహరిస్తరని, కార్యక్రమాల నిర్వహణకు ఫిజికల్ డైరెక్టర్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, శాప్ అధికారులను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అంతేకాకుండా, 'ఆడుదం ఆంధ్ర' కోసం రిజిస్ట్రేషన్ ఇప్పటికే  https://aadudaamandhra.ap.gov.in/login online ద్వారా ప్రారంభమైందని ఆయన చెప్పారు. ఇప్పటివరకూ జిల్లాల్లో 13219 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వీరిలో బాలికలు, మహిళలు 867 మంది మాత్రమే ఉన్నారని, వీరి సంఖ్య పెరగాలని చెప్పారు. ఇంకా పోటీల్లో పాల్గొనేవారు 1902కు కాల్ చేసి కూడా రిజిస్టర్ చేసుకోవచ్చని, దీనికి డిసెంబర్ 13వ తేదీ చివరి రోజని, ఆటల్లో పాల్గొనే వారికి నియోజకవర్గ స్థాయి నుంచి భోజన, వసతి ఏర్పాట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో అర్. వెంకట్రామన్, జిల్లా గ్రామీణాభవృద్ధి సంస్థ పధక సంచాలకులు డివి.విద్యా సాగర్, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా నోడల్ అధికారి వాసుదేవరావు, ముఖ్య ప్రణాళిక అధికారి వి.ఎస్.ఎస్. లక్ష్మిప్రసన్న, జిల్లా బిసి సంక్షేమ అధికారి అనురాధ, సెట్ శ్రీ సిఈవో ప్రసాద రావు, చీఫ్ కోచ్ శ్రీధర్, శ్రీకాకుళం మున్సిపల్ కమీషనర్ చల్లా ఓబులేసు, నెహ్రూ యువ కేంద్రం కో ఆర్డినేటర్ ఉజ్వల్, మెప్మ పిడి ఎం.కిరణ్ కుమార్, పరిశ్రమల కేంద్రం జిల్లా మేనేజర్ ఉమా మహేశ్వరరావు, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సాంబ మూర్తి, అన్ని మండలాల ఎంపీడీవోలు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments