శ్రీకాకుళం, డిసెంబర్ 1 : యువ ఓటర్ల నమోదుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి శుక్రవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల స్థితి, ప్రత్యేకంగా 30 రోజులకు పైగా పెండింగ్‌లో ఉన్న 132 ఫారమ్‌లు, ఎస్ఎస్ఆర్- 2024 సమయంలో స్వీకరించిన ఫారమ్‌లు గురించి వివరించారు. గడిచిన నెల రోజుల్లో 23,305 మంది 18-19 ఏళ్ల వారిని ఓటర్లుగా నమోదు చేశామని చెప్పారు. మరో 9వేల మందిని కొత్త ఓటర్ల జాబితాలో చేర్చాల్సి ఉందని అంచనా వేస్తున్నామన్నారు. గత నెల రోజుల్లో 65,716 వివిధ రకాల (ఫారం 6, 7, 8) దరఖాస్తులు స్వీకరించామని చెప్పారు. వీటిలో ఇంకా 13,661 దరఖాస్తులు పరిష్కరించాల్సి ఉందన్నారు. ఓకే ఇంటి నంబర్ తో 10 కంటే ఎక్కువ ఓట్లు ఉన్న 18 ఇళ్లను గుర్తించామని విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు.
రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ డ్రాఫ్ట్ పబ్లికేషన్ రోజున పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల స్థితి, అనోమలిస్ పెండింగ్, ముసాయిదా జాబితాపై ఓట్ల చేర్పులు, తొలగింపులు, సవరణలు, పెండింగ్ ఉన్న రాజకీయ పార్టీల ఫిర్యాదులు, ఈ రోల్‌పై రిపోర్ట్ లు, ఎపిక్ కార్డుల జనరేషన్.. పంపిణీ, పీఎస్ఈలు, డీఎస్ఈలు, నోడల్ అధికారులు, సెక్టార్ అధికారులు, సెక్టార్ పోలీసు అధికారుల మొదటి దశ శిక్షణ, తదితర అంశాలపై సమీక్షలో భాగంగా క్షుణ్నంగా వివరాలు అడిగారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, ఆర్డీవో సి హెచ్. రంగయ్య, ప్రత్యేక ఉప కలెక్టర్ జయదేవి, జిల్లా పరిషత్ సీఈఓ ఆర్. వెంకట్ రామన్ తదితరులు పాల్గొన్నారు.
0 Comments