ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ఎయిడ్స్ పై అందరూ అవగాహన కలిగి ఉండాలి. కలెక్టర్

*ఎయిడ్స్ పై అందరూ అవగాహన కలిగి ఉండాలి*

*అప్రమత్తంగా ఉందాం.. అడ్డుకత్త వేద్దాం*

*జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్*

శ్రీకాకుళం,డిశంబరు,1: ఎయిడ్స్ పై అందరూ అవగాహన కలిగి ఉండాలని, అప్రమత్తంగా ఉందాం.. అడ్డుకత్త వేద్దాం అని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీ ని ఆయన ప్రారంభించారు. ఈ ర్యాలీ ఏడు రోడ్ల కూడలి మీదుగా పాత బస్సు స్టెండ్ కి చేరుకొని బాపూజీ కళామందిర్ వరకు సాగింది. 

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అప్రమత్తంగా ఉండటంతోనే మహమ్మారిని అంతం చేయగలమని, రక్త మార్పిడి సమయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎయిడ్స్ పై అందరూ అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. ఎయిడ్స్ పై వివిధ అవగాహన కార్యక్రమాలను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఎయిడ్స్ పై జాగ్రత్తలు పాటించాలని కోరారు. ఎయిడ్స్ అపోహాలు వద్దని చెప్పారు. రక్త పరీక్షలు చేసినపుడు వైద్య సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అందరూ సమానతతో ఉండాలని కోరారు. అలాగే నేటికీ జిల్లాలో 8000 మందికి యాంటీ రైట్రో్వెల్ థెరఫీ చికిత్స, 2000 మందికి పెన్షలు అందజేయడం జరుగుతుందన్నారు.

ర్యాలీ అనంతరం బాపూజీ కళామందిర్ లో అవగహన సదస్సు జరిగింది. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారిణి మాట్లాడుతూ హెచ్ఐవి విజృంభణ ఎలా జరుగుతుందో వివరించారు. హెచ్ఐవి పాజిటివ్ ఉన్నంత మాత్రాన ఎయిడ్స్ ఉన్నట్లు కాదు. మూడు స్థాయిలు దాటిన తర్వాత ఎయిడ్స్ మారుతుందన్నారు. హెచ్ఐవి రాకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. హెచ్ఐవి పాజిటివ్ గా గుర్తించిన వారు తప్పని సరిగా చికిత్స తీసుకుంటూ మందులు తీసుకోవాలన్నారు. అదనపు జిల్లా వైద్య అధికారి, ఎయిడ్స్, లేప్పరిసి అధికారిణి డాక్టర్ అనూరాధ మాట్లాడుతూ జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణకు చేపడుతున్న కార్యక్రమాలు వివరించారు. ఎయిడ్స్ నియంత్రణకు చేపట్టవలసిన జాగ్రత్తలు వివరించారు. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెచ్ ఐ వి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న వారితో ఎయిడ్స్ నియంత్రణకు తమ వంతు కృషి చేస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి ఆర్ సన్యాసినాయుడు, ఎయిడ్స్ వైద్య అధికారి డా, బి.అప్పలనాయుడు, డిఐఓ ఈశ్వరీ దేవి, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకట రమణ, ఎయిడ్స్ ప్రోగ్రాం అధికారి ఉమామహేశ్వరరావు, రిమ్స్ ప్రతినిధి పద్మావతి, సమాజ సేవకులు మంత్రి వెంకట స్వామి, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, స్వీప్ స్వచ్చంద సంస్థ ప్రతినిధి రమణ, ఎన్ సి సి కామెండర్ పోలినాయుడు, ఎన్ సి సి విద్యార్థులు, ఆరోగ్య సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Post a Comment

0 Comments