*కోవిడ్ కష్ట కాలంలోనూ అన్ని వర్గాల వారికి ఆర్ధిక చేయూత*
*అర్హతే ప్రమాణికంగా సంక్షేమ పధకాలు అమలు వర్తింపు*
*నవరత్నాలు పధకాలు అమలుతో ప్రగతి బాటలో ఆంధ్రప్రదేశ్*
*సమస్యలు పరిష్కారానికి గడప గడపకు మన ప్రభుత్వం చక్కని వేదిక*
*ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం*
ఆముదాలవలస,బూర్జ, డిసెంబర్ 1 :
అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. బూర్జ మండలం అయ్యవారి పేట గ్రామంలో గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. సంబంధిత అధికారులు, సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి నాలుగున్నర ఏళ్లలో ప్రభుత్వ పాలనలో ప్రజలకు అందించిన లబ్ధిని వివరిస్తూ సమస్యలు తెలుసుకొన్నారు. నాలుగున్నర ఏళ్ల ప్రభుత్వ పాలనలో ప్రజలకు అందించిన లబ్ధిని వివరిస్తూ సమస్యలు అడిగి తెలుసుకొన్నారు..ప్రజలు విన్నవించిన సమస్యలను అక్కడే ఉన్న అధికారులు ద్వారా తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి కలిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంటి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలించడం ప్రజల అదృష్టమన్నారు.ముఖ్యమంత్రి అమలు చేస్తున్న నవరత్న పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని అన్నారు.ప్రతి సచివాలయానికి ముఖ్యమంత్రి రూ.20 లక్షల గడప గడపకు మన ప్రభుత్వం నిధులు మంజూరు చేశారని ఆయా సమస్యలను పరిష్కరించాలనే సీఎం చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమన్నారు.ఏ ఇంటికెళ్ళిన సంక్షేమ పథకాలు అందుకున్న ప్రజలంతా ఆనందోత్సాహాలతో స్వాగతం పలుకుతున్నారన్నారు.రోడ్లు, డ్రైన్లు వంటి సమస్యలు విషయంలో పరిష్కారానికి తగిన చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచనలతో దళారులకు అవకాశాలు లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు అర్హతగల లబ్ధిదారులకు అందుతున్నాయన్నారు.సచివాలయ,వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలను నేరుగా ప్రజలకు చేరేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పారదర్శక పాలనను ప్రవేశపెట్టారన్నారు.రైతులకు రైతు భరోసా కేంద్రాలు ద్వారా విస్తృత సేవలు అందిస్తున్నారన్నారు. నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రతి గ్రామంలో సర్కారీ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పిస్తున్నారన్నారు. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలకు మరింత దగ్గర చేయాలనే ఉద్దేశంతో ప్రతి గ్రామంలోనూ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయడం జరుగుతోందని తద్వారా పేద ప్రజలందరికీ నాణ్యమైన సత్వర వైద్యం అందించాలనేది ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఉద్దేశ్యం అన్నారు.రానున్న రోజుల్లో రాష్ట్రం అభివృద్ధి మార్గంలో పయనించాలంటే జగన్మోహన్ రెడ్డి పాలన ద్వారా మాత్రమే సాధ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కర్నేన నాగేశ్వరరావు జెడ్పీటీసీ బెజ్జిపురపు రామారావు, మండల పార్టీ అధ్యక్షుడు టిట్కో డైరెక్టర్ కండాపు గోవిందరావు, వైస్ ఎంపీపీ బొడ్డేపల్లి సూర్యారావు కరణం కృష్ణం నాయుడు, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు మండల సచివాలయాల కోఆర్డినేటర్ గుమ్మడి రాంబాబు
పి ఎ సి ఎస్ అధ్యక్షులు బాగాది నారాయణ మూర్తి, మండల సర్పంచ్ల సంఘ అధ్యక్షులు సురపు ఉదయ్ కుమార్ స్థానిక సర్పంచ్ ఇప్పిలి సిమ్మమ్మ, ఎక్స్ సర్పంచ్ మామిడి శ్రీరాములు,ఉప సర్పంచ్ రామి నాయుడు,గార రాంబాబు, యువజన పార్టీ అధ్యక్షులు శ్రీను, ఇప్పీలి నర్సింహ మూర్తి
మరియు వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు కార్యకర్తలు అధికారులు, సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.
0 Comments