నాటి సమాజంలో ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్ తన జీవిత కాలం చేసిన పోరాటం మరుగు లేనిదని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా, ఆముదాలవలస లో నిర్వహించిన కార్యక్రమంలో సభాపతి పాల్గొన్నారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల నివాళులర్పించారు. అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిందన్నారు.న్యాయవాదిగా,ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా భారతీయ సమాజంలో పేరుగాంచారన్నారు. అంతకంటే మిన్నగా రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చరిత్ర ఉన్నంతకాలం పదిలంగా ఉంటుందన్నారు.అంటరానితనంపై ఆయన పూరించిన సమర శంఖారావం చరిత్ర ఉన్నంత వరకు మరువదన్నారు. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడుగా అంబేద్కర్ ను అభివర్ణించారు.కుల,మత రహిత ఆధునిక భారత దేశం కోసం అంబేద్కర్ తన జీవితకాలం పోరాటం చేశారన్నారు. చిన్ననాటి నుంచే తాను ఎదుర్కొన్న అంటరానితనాన్ని ఎవరూ ఎదుర్కోకూడదని అణగారిన వర్గాలకు అండగా నిలబడ్డారన్నారు.ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఇప్పటికీ చారిత్రాత్మకమైనవిగా అభివర్ణించారు.కొలంబియా యూనివర్సిటీ,లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌తో పాటు ఎన్నో ప్రఖ్యాతి గాంచిన విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించారన్నారు.విదేశాలలో ఎకనామిక్స్‌లో డాక్టరేట్ పొందిన మొట్టమొదటి భారతీయుడిగా గుర్తింపు పొందారన్నారు.సమస్యలను ఎదిరించాలంటే చదువొక్కటే మార్గమని భావించారన్నారు. స్వాతంత్ర భారతావనికి తొలి న్యాయశాఖ మంత్రి గా అమూల్యమైన సేవలు అందించారన్నారు.అనేక దేశాల రాజ్యాంగాన్ని ఆధ్వయనం చేసిన అంబేద్కర్ దృఢమైన రాజ్యాంగాన్ని అందించిన ఘనత అంబేద్కర్ కు దక్కిందన్నారు.ఆర్థికవేత్తగా కూడా ఎంతో గొప్పగా పేరు సంపాదించారన్నారు.పారిశ్రామికీకారణ, వ్యవసాయాభివృద్ధి దేశానికి ఊతమిస్తాయని బలంగా నమ్మిన వ్యక్తి అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ కలలు కన్నా సమ సమాజ నిర్మాణానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పాటు పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ ఫ్లోర్ లీడర్ అల్లం శెట్టి ఉమామహేశ్వరరావు మామిడి రమేష్ కుమార్ దుంపల శ్యామలరావు బొడ్డేపల్లి రవి సాధు కామేశ్వరరావు కుప్పిలి సత్యనారాయణ పొన్నాడ చిన్నారావు తదితరులు పాల్గొన్నారు
0 Comments