మిచాంగ్ తుఫాను కారణంగా జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎక్కడైనా పంట నష్టం సంభవిస్తే రైతులు వారి వారి స్థానిక రైతు భరోసా కేంద్రాలను సంప్రదించి సమస్యను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. తుఫాను తదనంతర పరిస్థితులపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర ముఖ్య అధికారులతో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి నుంచి బుధవారం మధ్యాహ్నం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ నకు ఆయన హాజరయ్యారు. అనంతరం ఆయన జిల్లా అధికారులతో మాట్లాడుతూ వర్షాల కారణంగా పొలాల్లో నీరు నిలువ ఉండి పంటలు నష్టపోయిన ప్రాంతాలలో వ్యవసాయ శాఖ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టాలు ఉన్నట్లయితే నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి ఇతర ఏ నష్టాలైనా ఉన్నట్లయితే రెండు రోజులలో నివేదించాలని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా ఎస్పీ జి.అర్.రాధిక, జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి కే.శ్రీధర్, ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు.
0 Comments