ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

అభివృద్ది పనులపై దృష్టి సారించాలి. స్పీకర్ తమ్మినేని సీతారాం

శ్రీకాకుళం, డిసెంబర్ 2 : స్థానిక సంస్థలకు నిధులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉన్నాయని అభివృద్ది పనులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. జెడ్పీ ఛైర్పర్సన్ పిరియా విజయ అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం జరిగిన జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ ఒక్కరికి ఇళ్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న జగనన్న కాలనీ ఇళ్లకు ఎలాంటి అడ్డంకులు ఉండరాదని, అక్కడ మౌలిక వసతుల కల్పనలో ఆలస్యం అవ్వకుండా త్వరిత గతిన పనులు చేయాలన్నారు. నవరత్నాల అమలు మొదటి ప్రాధాన్యతని ఎప్పుడూ గుర్తించుకోవాలన్నారు. తొలుత గృహ నిర్మాణ శాఖతో సమీక్ష ప్రారంభించి పాఠశాల విద్యాశాఖ పై ఆయన సభ్యులతో కలిసి సుదీర్ఘ చర్చ చేశారు. నాడు నేడు పనులలో బిల్లుల పెండింగ్ పై గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఇసుక లభ్యతపై ఇబ్బందులు తలెత్తుతున్నాయని సభ్యులు కోరడంతో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాటకర్ మాట్లాడారు. వారంలో జిల్లాలో స్టాక్ పాయింట్స్ ఏర్పాటు చేస్తామని, ముందుగా కంచిలి, ఇచ్చాపురంలలో వాటిని ప్రారంభిస్తామని చెప్పారు. జిల్లాలో ఎన్ఆర్ఈజీఎస్ పనులు, నీటిపారుదల శాఖ, వ్యవసాయ శాఖ, ముఖ్య ప్రణాళిక విభాగం పర్యవేక్షిస్తున్న కేంద్ర ప్రభుత్వ నిధులతో జరుగుతున్న పనులపై సమీక్ష నిర్వహించారు. సభ్యులు లిఖిత పూర్వకంగా కూడా తమ సమస్యలను తెలియజేయవచ్చని జెడ్పీ ఛైర్పర్సన్ విజయ కోరారు. 

సమావేశంలో సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, జిల్లా పరిషత్ సీఈఓ అర్. వెంకట్రామన్, ఎమ్మెల్సీ, సహాయ మంత్రి పాలవలస విక్రాంత్, ఎమ్మెల్సీ నర్తు రామారావు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్ర శేఖర్, ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, రెడ్డి శాంతి, కంబాల జోగులు, విశ్వసరాయ కళావతి, పలు మండలాల జెడ్పీటీసీ, ఎంపీపీలు, జిల్లా ఉన్నాధికారులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments