ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ఇవిఎం డిమానిస్ట్రేషన్ వాహనాన్ని జండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్

శ్రీకాకుళం, డిసెంబర్ 01: ఓటు వినియోగంపై ప్రతీ ఒక్కరికి అవగాహన అవసరం అని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు.

శుక్రవారం రెవిన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయం దగ్గర ఇవిఎం  డిమానిస్ట్రేషన్ సెంటర్ ను మరియు మొబైల్ ఇవిఎం  డిమానిస్ట్రేషన్ వాహనాన్ని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ జండా ఊపి ప్రారంభించారు.  ఓటర్ ల ను ఈవీఎంల పట్ల అవగాహన కల్పించడానికి ఎలక్షన్ కమిషన్ వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు అని కావున అందరూ ఈ అవకాశాన్ని వినియోగించు కోవాలనీ అలాగే 18 సంవత్సరాలు నిండిన అర్హులు అందరూ ఓటర్ లు గా నమోదు చేసుకోవాలి అని తెలియజేశారు ఈ కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్ శ్రీకాకుళం వారు, శ్రీకాకుళం రెవెన్యూ డివిజనల్ అధికారి సి హెచ్ రంగయ్య,  తహశీల్దార్ వెంకట రావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments