ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

దళిత యువతని ప్రేమించి మోసం చేసిన యువకుడు

శ్రీకాకుళం:దళిత మహిళ ధర్మాన గౌరీ ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినటువంటి దువ్వరపు హరిబాబును కఠినంగా శిక్షించాలి.

బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా గౌరీని అన్యాయం చేసినటువంటి సారవకోట ఎస్సై పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని దళిత ప్రజా సంఘాల డిమాండ్.

బాధిత మహిళ గౌరీ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా దువ్వారపూ అప్పారావు , దువ్వారపు పద్మ, కలివరపు డీల్లేశ్వరరావు, కలివరపు అప్పన్న కలివరపు ఆదినారాయణ, కలివరపు జనార్దన్ రావు ,కలివరపు లక్ష్మణరావు, కలివరపు వనజ మొత్తం ఎనిమిది మంది పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలి.

ధర్మాన గౌరీ కేసు పై సారవకోట ఎస్సై, మరియు ఇన్వెస్టిగేషన్ అధికారి తీరుపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ కు ధర్మాన గౌరీ ఫిర్యాదు

దళిత మహిళ ధర్మాన గౌరీ కి న్యాయం జరిగే వరకూ దశల వారి ఆందోళనకు జిల్లా దళిత ప్రజా సంఘాలు పిలుపునిచ్చారు.

ఈరోజు ఉదయం 10:30 గంటలకు అంబేద్కర్ విజ్ఞాన మందిరం ఇన్స్పురంలో దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సామాజిక న్యాయ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కల్లేపల్లి రామ్ గోపాల్, మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనెల అప్పారావు,కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా నాయకులు రాకోటి రాంబాబు ,సామాజిక న్యాయ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, సమతా సైనిక దళ్ జిల్లా కార్యదర్శి ఇల్లాకుల సూర్య ప్రకాష్ , అదపాక గౌర్నాయుడు, దళిత హక్కుల పరిరక్షణ సమితి జిల్లా నాయకులు పాతల దుర్గారావు బైరి ధనరాజ్, అంబేద్కర్ విశ్వవిద్యాలయం లో చైర్ సాధన సమితి కోశాధికారి టొoపల రవణ,చల్ల రాజు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు పంకు ప్రసాదు మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం కెలవశ గ్రామం కు చెందిన ధర్మాన గౌరీ 23 సంవత్సరాలు 2017 సంవత్సరం నుండి ధర్మాన గౌరీ ప్రేమిస్తున్నాను నిన్నే పెళ్లి చేసుకుంటాను అని వెంటపడి వేధించి గౌరీలో లేనిపోని ఆశలు రగిలించి ఆమెని శారీరకంగా వశపరచుకొని పెళ్లి చేసుకోమని గౌరీ అడిగితే నువ్వు మాల కులమాల కులానికిచెందిన దానము నువ్వు అంటరాని దానవు నిన్ను పెళ్లి చేసుకుంటే మా కుటుంబం మా కులం నన్ను వెలివేస్తోంది కాబట్టి నిన్ను నేను పెళ్లి చేసుకోను అని చెప్పడాన్ని దళిత సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ప్రేమకు లేని కులం పెళ్లి చేసుకుంటే వస్తుందా అని ప్రశ్నించాయి, ధర్మాన గౌరీ సారవకోట ఎస్సై కి ఇచ్చినటువంటి ఫిర్యాదులో తనపై ఏ రకంగా వారి బంధువులు దాడి చేశారు ఏ రకంగా కులం పేరుతో తిట్టారు అని చెప్పి ఎనిమిది మంది పేర్లు ఫిర్యాదులు ఇస్తే అందులో ప్రధాన నిందితుడిగా హరిబాబుని ఇంకొక నిందితురాలుగా కలివరపు వనజను మాత్రమే చేర్చి మిగతా ఏడు మందిని తప్పించి పూర్తిగా కేసులు నీరుగారిచే పని చేసినటువంటి సారవకోట ఎస్సై పై జిల్లా ఎస్పీ గారు తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ అధికారి వ్యవహరించిన తీరు మహిళా లోకానికి తీవ్ర అన్యాయంగా భావించవలసి వస్తుందని మండిపడ్డారు .నాకు అన్యాయం జరిగిందని చెప్పి ఫిర్యాదు ఇచ్చి నాకు ఆన్యాయం చేసిన వ్యక్తితో పెళ్లి చేయండి అని వేడుకున్న సంబధిత ఇన్వెస్టిగేషన్ అధికారి కొంతమంది ప్రలోభాలకు తలొగ్గి ఇన్వెస్టిగేషన్ అధికారి నిందితుడికి కొమ్ముకాసే విధంగా దర్యాప్తు జరిపి ఈ కేసులో ఉన్నటువంటి ఏడు మందిని తప్పించడం వెనకాల అనేక రకాల అనుమానాలకు తావిస్తోందని తక్షణమే ధర్మాను గౌరీ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి అందరిపైనా ఎస్సీ ఎస్టర్సిటీ కేసు నమోదు చేసి రిమాండ్ గా పంపించాలని దళిత సంఘాలుగా డిమాండ్ . లేని పక్షంలో ధర్మాన గౌరీకి న్యాయం జరిగే వరకూ దశల వారి ఆందోళనకు పిలుపు ఇవ్వవలసి ఉంటుందని దళిత సంఘాలు దళిత ప్రజా సంఘాల డిమాండ్ చేశారు.

Post a Comment

0 Comments