కలెక్టర్ గా శ్రీకేష్ లాఠకర్ జిల్లా ప్రజల గుండెల్లో సుస్థిరమైన ప్రేమాభిమానాలను చూరగొన్నారని మాజీ డిప్యూటీ సీఎం, నరసన్నపేట శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ కు ఆయన వీడ్కోలు పలుకుతూ కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం పుష్పగుచ్చాన్ని అందజేసి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండున్నర ఏళ్లకు పైగా జిల్లాలో సేవలందించి ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశాలైన నవరత్నాల పథకాలు అమలు చేయడంలోనూ, జిల్లాలో చేపట్టిన కీలక ప్రాజెక్టులు కార్యరూపం దాల్చడంలో ప్రత్యేక శ్రద్ధ వహించారన్నారు. ముఖ్యంగా కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రి నిర్మాణం, ఉద్దానం రక్షిత మంచినీటి ప్రాజెక్టు, మూలపేట పోర్టు విషయంలో ప్రత్యేక చొరవ చూపారన్నారు. సమగ్ర భూ సమగ్ర సర్వే, ఉపాధి హామీ పథకం అమల్లో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేశారని ప్రశంసించారు. నాడు-నేడు, గ్రామస్థాయి సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు నిర్మాణం, సచివాలయాలకు సోలార్ వెలుగులు, ఉద్దానం కిడ్నీ బాధితులకు డయాలసిస్ సేవలు తదితర వాటిలో సమర్థంగా, సమయస్సూ ర్తితో వ్యవహరించారని కొనియాడారు. ఐఏఎస్ గా ఉన్నత స్థానంలో ఎక్కడ పనిచేసిననా జిల్లాపై ఇవే ప్రేమాభిమానాలు కురిపించాలని కృష్ణదాస్ కోరారు.
0 Comments