శ్రీకాకుళం, 30 జనవరి: శ్రీకాకుళం జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి జి.ఆర్ రాధిక మరియు రాష్ట్ర ప్రజారోగ్య శాఖ - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మార్గనిర్దేశంలో శ్రీకాకుళం జిల్లా పోలీసులు బహిరంగ ప్రదేశంలో ధూమపానం చేసే వారిపై మరియు విద్యా సంస్థలకి 100 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తులు అమ్మే వారిపై కఠిన చర్యలు, పొగాకు ఉత్పత్తులు జిల్లాలోని పూర్తి స్థాయిలో నిషేదించాలని,సిగరెట్లు,ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం (COTPA) ని ప్రభావవంతంగా అమలు చేయడానికై, జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమం (NTCP) మరియు రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ సంబంధ్ హెల్త్ ఫౌండేషన్ వారి సహకారంతో జిల్లాలోని పోలీసు అధికారులకి మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీలు జె.తిప్పే స్వామి, టి.పి. విటలేశ్వర్ అధ్యక్షతన సమగ్ర శిక్షణ కార్య్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమం లో పొగాకు వ్యతిరేకంగా పోరాడటంలో వారి నిబద్ధతకు నిదర్శనంగా పోలీసు అధికారులందరూ పొగాకు కు వ్యతిరేకంగా పోరాడుతామని ప్రమాణం చేశారు.
ఈ సందర్భంగా జె తిప్పే స్వామి మాట్లాడుతూ పొగాకు సంబంధిత వ్యాధుల కారణంగా మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సుమారు 48 వేల మరణాలు సంభవిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు. COTPA పైన నిర్వహించిన ఈ శిక్షణా తరగతులు పోలీసు అధికారులకు చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో సహాయపడుతుందన్నారు. కాట్పా చట్టం లోని సెక్షన్ 6 (బి) ప్రకారం విద్యాసంస్థలకి 100 యార్డులు (300 ఫీట్ల) పరిధిలో పొగాకు విక్రయించడం నిషేధం అని తెలిపారు. పెద్ద వయస్కుల వారు పొగాకు వ్యసనపు విషపు కోరల్లో చిక్కుకున్నప్పటికీని, పిల్లల్ని పొగాకు వ్యసనపరులు కాకుండా రక్షించడం మరియు వాళ్ళని పొగాకు ఉత్పత్తులకు అలవాటు కాకుండా నిరోధించడం మన కర్తవ్యం అని తెలిపారు. బహిరంగ ప్రదేశాలలో ధూమపానం పొగాకు ఉత్పత్తులు వాడిని వారిపై క్రయ విక్రయాలు చేసిన వారిపై కూడా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటూనే ఆయన తెలిపారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు శ్రీకాకుళం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో "నో స్మోకింగ్" బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాట్పా చట్టం లోని సెక్షన్ -4 ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధం.
టి.పి విటలేశ్వర్ మాట్లాడుతూ
ఎక్కువ మంది పిల్లలు పొగాకు ఉత్పత్తుల వాడకాన్ని ప్రారంభిస్తున్నారు కాగా ఎక్కువమంది వాటికి బానిసలుగా మారుతున్నారు. అంతేకాకుండా జువైనల్ జస్టిస్ చట్టంలోని సెక్షన్ 77 ప్రకారం ఎవరైనా మత్తు కలిగించే పదార్థాలు లేదా మద్యం లేదా పొగాకు ఉత్పత్తులు లేదా సైకోట్రోపిక్ పదార్థాన్ని కలిగిన ఉత్పత్తులని తగిన అర్హత కలిగిన వైద్యుల ఆదేశానుసారం తప్ప ఇంకా ఏ ఇతర సందర్భాల్లోనైనా పిల్లలకు ఇచ్చిన లేదా ఇవ్వడానికి కారణమైనా వారికి ఏడేళ్లు వరకు కఠిన కారాగార శిక్ష విధించబడుతుంది మరియు లక్ష రూపాయల వరకు జరిమానా కూడా విధించబడుతుంది.
డా.అనురాధ జిల్లా అదనపు వైద్యారొగ్యశాఖాధికారి - గ్లోబల్ యూత్ టొబాకో సర్వే (GYTS) యొక్క ఫలితాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలోని 13 నుంచి 15 సంవత్సరాల వయస్సు వారిలో 33.6% మంది పొగాకు వినియోగదారులుగా ఉన్నారు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తుల ప్రాబల్యాన్ని తగ్గించడానికి ఆరోగ్య మరియు విద్యాశాఖలు అన్ని జిల్లాల్లో పొగాకు రహిత విద్యాసంస్థ (ToFEI) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయని తెలిపారు. ఇందుకు గాను పోలీస్ శాఖ బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో డీఎస్పీలు వై శ్రుతి, ఎస్ వాసుదేవ్, విజయ కుమార్, అడిషనల్ జిల్లా వైద్య అధికారిని అనురాధ, జిల్లా విద్యా అధికారి వెంకటేశ్వరరావు,పోలీస్ స్టేషన్ల వారిగ పోలీస్ అధికారులు, వైద్యశాఖ అధికారులు మరియు సంబంధ్ హెల్త్ ఫౌండేషన్ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
0 Comments