ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ప్రత్యేక హోదా,విభజన హామీలు అమలు చేయాలని నిరసన.

శ్రీకాకుళం:ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయకుండా బిజెపి రాష్ట్రానికి ద్రోహం చేసిందని ప్రత్యేక హోదా సాధన సమితి జిల్లా అధ్యక్షులు జి నర్సు నాయుడు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం. యుగంధర్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే మోహనరావు విమర్శించారు. ప్రత్యేక హోదా విభజన హామీల అమలు చేయాలని కోరుతూ మున్సిపల్ కార్యాలయం దగ్గర గాంధీ విగ్రహం వద్ద ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో నిరసన దీక్షలో ఉద్దేశించి వారు మాట్లాడుతూ విభజన హామీలను అమలు చేయాలని.. ఉత్తరాంధ్ర రాయలసీమకు కేబీకే ,బుందేల్ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ను విడుదల చేయాలని.. సంపూర్ణ విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని.. విభజన హామీల్లో భాగంగా అనేక కేంద్ర విద్యాసంస్థలు నెలకొల్పాలని, వాటికి అవసరమైన నిధులను కూడా సమకూర్చాలని.. విశాఖపట్నం చెన్నై కారిడార్ను అభివృద్ధి పరచాలని.. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి ఆస్తులు పంపకాలు జరిపి రాష్ట్రానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపికి.. వైసిపి, టిడిపి జనసేన మద్దతు పలకడం దుర్మార్గమైన చర్యని వారు విమర్శించారు. రాష్ట్రంలో వైసిపి టిడిపి దూషించుకుంటాయని కేంద్రంలో బిజెపి పంచన చేరుతాయని వారు విమర్శించారు. ప్రత్యేక హోదా విభజన హామీల కోసం ఎందుకు మాట్లాడటం లేదని వారు ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తామని హామీలు నేటికీ నెరవేరలేదని వారు విమర్శించారు
. బిజెపి ప్రభుత్వం ప్రజాధనంతో నిర్మించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను కార్పొరేట్లకు అప్పజెప్పడానికి పూనుకుంటుందని వారు విమర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని.. స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక ఘనులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు .రాష్ట్రానికి ద్రోహం చేసిన బిజెపి దానికి మద్దతు పలుకుతున్న పార్టీలకు, ప్రజలకు గుణపాఠం చెప్పాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి అల్లు.సత్యనారాయణ, ఆల్ పెన్షనర్స్, అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.పార్వతీశం, ఎం. ఆదినారాయణమూర్తి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.ప్రసాద్,జి సింహాచలం, బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఎం. గోవర్ధనరావు, జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు కె .అప్పారావు, ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొండా. శ్రీనివాసరావు, ఏ ఐవైఎఫ్ నాయకులు రాము, కర్ణ, అరవింద్, పవన్, రాంజీ ,కిషోర్, కాంగ్రెస్ నాయకులు కేవి ఎల్ఎస్ఈశ్వరి, సిపిఐ చిక్కాల.గోవిందరావు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments