శ్రీకాకుళం, జనవరి 30: ప్రధాన మంత్రి విశ్వకర్మ పథకాన్ని అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పరిషత్ సిఈఓ వెంకటరామన్ పిలుపునిచ్చారు. పిఎం విశ్వకర్మ పథకం పై మంగళవారం డిఆర్డిఎ సమావేశ మందిరంలో సెమినార్ కం ఒక రోజు అవగాహన కార్యక్రమం మాట్లాడుతూ విశ్వకర్మ పథకం ముఖ్య ఉద్దేశం వారి వారి వృత్తి పనులు చేసుకుంటున్న వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ పథకం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 18 రకాలైన కుల వృత్తులు వారిని గుర్తించినట్లు తెలిపారు. 3 లక్షల రూపాయలు వరకు రుణ సదుపాయం ఉంటుందని, వడ్డీ 5 శాతం మాత్రమే ఉంటుందన్నారు. అర్హత గల వారంతా విశ్వకర్మ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఔత్సాహికులకు వారి వారి నైపుణ్యాన్ని గుర్తించి తగు శిక్షణ ఇచ్చి వారి అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.
ఎల్డీయం సూర్యకిరణ్ మాట్లాడుతూ విశ్వకర్మ పథకం శిక్షణకు హాజరైన వారికి మొదటి దశలో ఒక లక్ష రూపాయల రుణ ఇస్తుందన్నారు. 5 శాతం వడ్డీ తో రుణం తిరిగి చెల్లిస్తే తిరిగి మరోసారి 2 లక్షల రూపాయలు రుణం అందజేస్థుందన్నారు. అందరూ సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 18 సంవత్సరాలు దాటిన వారంతా ఏ బ్యాంకులో ఎకౌంట్ ఉంటుందో ఆ నంబర్ లింక్ చేసి ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవచ్చన్నారు. శికణలో ఒక రోజుకు ఐదు వందల రూపాయలు ఇన్ సెంటివ్ కూడా ఇస్తారని చెప్పారు. శిక్షణకు హాజరైన వారికి వారి వృత్తికి సంబంధించి కిట్ ఒకటి ఇస్తారని వెల్లడించారు. స్వయంగా అభివృద్ధి చెందడానికి ప్రధానమంత్రి ఈ పథకం ఏర్పాటు చేసినట్లు వివరించారు.
డిఆర్డిఎ పిడి విద్యాసాగర్ మాట్లాడుతూ విశ్వకర్మ పథకానికి సంబంధించి ప్రస్తుతం ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకున్న వారే కాకుండా అర్హులైన వారికి అందరికి తెలియజేయాలని చెప్పారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పధకానికి దరఖాస్తు చేసుకుని ప్రతీ ఒక్కరు పారిశ్రామికవేత్తలు కావాలని పిలుపునిచ్చారు. అర్హత కలిగిన వారికి భారత ప్రభుత్వం మొదటి విడతగా 5 శాతం వడ్డీతో లక్ష రూపాయలు బ్యాంక్ ద్వారా రుణాన్ని అందజేస్తుందని తెలిపారు. తీసుకున్న రుణాన్ని 18 వాయిదాలలో తిరిగి బ్యాంక్ లకు చెల్లించాలని, రెండవ విడతగా 2 లక్షల రుణాన్ని అందిస్తుందని వివరించారు. డ్వామా పిడి చిట్టిరాజు మాట్లాడుతూ విశ్వకర్మ పథకంలో అర్హులైన వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని, బ్యాంకు వడ్డీ 5 శాతం తో రుణం ఇస్తుందని చెప్పారు. పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి భారత ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని తెలిపారు.
జిల్లా పరిశ్రమల అధికారి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విశ్వకర్మ పథకంలో 18 సంవత్సరాలు నిండిన వారు ఈ పథకానికి అర్హులని, ఆన్ లైన్ లో విశ్వకర్మ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇప్పటికే చాలా వరకు ఆన్ లైన్ లో ధరఖాస్తులు పెట్టుకున్నట్లు వివరించారు. 2 లక్షల రూపాయలు వరకు రుణాలు ప్రభుత్వం అందిస్తుందని చెప్పారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పధకానికి ఎంపికైన వారికి 5 నుండి 7రోజులు శిక్షణా తరగతులు ఉంటాయని పేర్కొన్నారు. ప్రోత్సాహకంగా రోజుకి 500 రూపాయలను భారత ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు. సమయం ఇంకా ఉంది అర్హులైన వారంతా ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. చేతి వృత్తుల వారిని ప్రోత్సహించేలా ఈ పధకం ఉపయోగపడుతుందన్నారు.
బిసి సంక్షేమ అధికారి అనూరాధ మాట్లాడుతూ విశ్వకర్మ పథకం స్వయంకృషి ద్వారా అభివృద్ధి చెందాలన్నారు. కుల వృత్తులను అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. బ్యాంకులో సివిల్ స్కోర్ పెరిగితే బ్యాంకు తిరిగి రుణం అందిస్తుందన్నారు. విశ్వకర్మ పథకంలో గ్రామ స్థాయి నుండి అర్హులైన వారంతా ధరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఈ సమావేశంలో డిపిఓ రవి కుమార్, బిసి కార్పొరేషన్ ఇడి గడ్డెమ్మ, ఎంఎస్ఎంఈ - డెవలప్‌మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ఎడి డివిఎస్ఆర్ మూర్తి, ఎపిడిఈఈఎ రాష్ట్ర ఎన్ జి ఓ అధ్యక్షుడు పినమాల నాగ కుమార్, పరిశ్రమల శాఖ ఎడి రఘునాథ్, డిపిఆర్ఓ బాలమాన్ సింగ్, తదితరులు పాల్గొన్నారు.
0 Comments