శ్రీకాకుళం, జనవరి 30: ఎందరో మహానుభావుల త్యాగఫలె ఈ భారతవని అని డైరెక్టర్ ప్రొఫెసర్. కె.వి.జి.డి బాలాజీ అని అన్నారు.మంగళవారం జాతీయ అమరవీరుల సంస్మరణ సభ రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం శ్రీకాకుళం ప్రాంగణం జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో జాతీయ అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డైరెక్టర్ ప్రొఫెసర్. కె.వి.జి.డి బాలాజీ పాల్గొని మొదటగా గాంధీ మహాత్ముని వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. అనంతరం అమరవీరుల గురించి మాట్లాడుతూ ఎందరో మహానుభావులు వారందరి త్యాగం, ఈ దేశం కోసం వారు చేసిన సేవలను కొనియాడారు. విద్యార్ధులందరూ వారందరినీ ఆదర్శంగా తీసుకుని బాగా చదువుకుని అత్యున్నత స్థాయిలో ఉండాలని ఆకాంక్షించారు. ఓయస్డీ సుధాకర్ బాబు గారు ఏవో ముని రామకృష్ణ గారు డీన్ మోహన్ కృష్ణ చౌదరి, ఎఫ్.వో డా. అసిరినాయుడు వెల్ఫేర్ డీన్ శ్రీ గేదెల రవి, ఎన్.ఎస్. ఎస్ కో ఆర్డినేటర్ డా పెద్దింటి ముకుందరావు, పీవోలు డా. ఆర్. గణపతిరావు, డా.బి. శ్రీధర్ మరియు అధ్యాపకులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
0 Comments