శ్రీకాకుళం, జనవరి 12 : స్వామి వివేకానంద చెప్పిన మాట, ఆయన నడిచిన బాట మనందరికీ ఆదర్శమని, ముఖ్యంగా యువత ఆ దిశగా నడవాలని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ యువతకు పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద 162వ జయంతి సందర్భంగా గురువారం స్థానిక సూర్యమహల్ కూడలి వద్ద గల వివేకానంద విగ్రహానికి పూలమాలను వేసి ఆయన ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వివేకానందుని జీవితం మనందరికీ ఎంతో స్ఫూర్తినిస్తుందని అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఆర్డీవో సిహెచ్ రంగయ్య, పర్యాటక శాఖ అధికారి ఎన్.నారాయణరావు, నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ ఉజ్వల్, శ్రీకాకుళం తాసిల్దార్ ఎన్ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
0 Comments