శ్రీకాకుళం, జనవరి 31: జిల్లా కేంద్రంలోని ఈవీఎం గోడౌన్లను జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తనిఖీ చేశారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా బుధవారం సాయంత్రం ఆయన ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను క్షుణ్ణంగా పరిశీలించారు. గోడౌన్ లో ఏర్పాటుచేసిన రక్షణ వలయాన్ని, జిల్లాలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో పరిశీలించి భద్రతా చర్యలను గురించి సమీక్ష చేశారు. ఈవీఎంలను భద్రపరిచిన తీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేసి పర్యవేక్షణ రిజిస్టర్ ను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ ప్రకాష్ రావు, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
0 Comments