శ్రీకాకుళంలోని ఏపీహెచ్‌బీ కాలనీలో నివాసం ఉంటున్న జామి ఇక్షిత, జామి సాక్షిత్‌లు తైక్వాండోలో అదరగొట్టే ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు. జామి కిరణ్, స్రవంతి వీరి తల్లిదండ్రులు. ఇప్పటికే అనేక రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో ప్రాతినిధ్యం వహించి, పతకాలతో సత్తాచాటిన వీరిద్దరు మరోసారి జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. వీరిద్దరు ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి 20,21 తేదీలో నంద్యాల జిల్లాలో జరిగిన ఖేలో ఇండియా రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో బంగారు పతకాలు సాధించి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలు ఫిబ్రవరి 7 నుంచి 9వ తేదీ వరకు పుదుచ్చేరి వేదికగా జరగనున్నాయి. వీరి రాణింపుపై తైక్వాండో జిల్లా సంఘ ప్రతినిధులు, కోచ్‌లు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్షిత విశాఖలోని ఓ ప్రైవేటు పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. సాక్షిత్ శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్నాడు. శ్రీకాకుళం నగరం టౌన్ హాల్‌లో గల స్కూల్ ఆఫ్ తైక్వాండో కోచ్ మజ్జి గౌతమ్ ఆధ్వర్యంలో శిక్షణ తీసుకుంటున్నారు.
0 Comments