ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ఈనెల 16న జిల్లా వ్యాప్తంగా నిరసనలు. సిపిఎం

శ్రీకాకుళం:ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ,ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి. తులసీదాస్ పిలుపునిచ్చారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై భారాలు వేస్తూ కార్పొరేట్లకు రాయితీలు ఇస్తున్నాయని ఆయన విమర్శించారు . ప్రజాధనంతో నిర్మించిన రైల్వే, టెలికాం, పోస్టల్, ఇన్సూరెన్స్, బ్యాంకులు, ఆయిల్ సెక్టార్, విద్యుత్తు, రోడ్లు పోర్టులు మొదలగు ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేసిందని విమర్శించారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు మాట్లాడుతూ జీడీకి గిట్టుబాటు ధర ఇవ్వాలని, కోడిరామ్మూర్తి స్టేడియం నిర్మాణం వెంటనే చేపట్టాలని, రిమ్స్ హాస్పిటల్ ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా ప్రమోట్ చేయాలని, వంశధార కాలువ మరమ్మత్తులు చేసి ఇచ్చాపురం వరకు మీరు ఇవ్వాలని, నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కే.మోహనరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఎం నాయకులు జి సింహాచలం.యన్. షణ్ముఖరావు కే.నాగమణి, పి.తేజేశ్వరరావు చర్ల ప్రసాదు.పోలాకి ప్రసాదుతదితరులు ప్రసంగించారు.

Post a Comment

0 Comments