పోలాకి: మండలంలోని ఈదులవలస గ్రామంలో ఎం.ఆర్.ఇ.జి.ఎస్ రూ. 21 లక్షలతో నిర్మాణం చేపట్టిన వైయస్సార్ హెల్త్ క్లినిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్,మరియు రాష్ట్ర బీసీ సెల్ జోనల్ ఇంచార్జ్ నరసన్నపేట నియోజకవర్గం యువ నాయకులు డా.ధర్మాన కృష్ణ చైతన్య ప్రారంభించారు.
అనంతరం ఈదులవలస జంక్షన్లో... సీఎండిఎఫ్ నిధులు రూ. 5 లక్షలతో నిర్మాణం చేపట్టిన (బస్ షెల్టర్) ప్రయాణికుల విశ్రాంతిభవనాన్ని ప్రారంభించారు.కొండలక్కివలస గ్రామం ఆర్ ఎండ్ బి రోడ్డు నుండి కొండ లక్కీ వలస గ్రామం వరకు ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ. 43 లక్షలతో నిర్మాణం చేపట్టిన రోడ్డు ప్రారంభించారు.
పోలాకి పంచాయతీ వెదుళ్ళవలస గ్రామంలో నాడు -నేడు నిధులు రూ. 58 లక్షలతో అభివృద్ధి చేసిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రారంభించారు.పోలాకి మండలం పోలాకి పంచాయతీ వెదుళ్ళవలస గ్రామంలో నాడు - నేడు నిధులు రూ. 1 కోటి 13 లక్షలతో అభివృద్ధి చేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీ ముద్దాడ బైరాగి నాయుడు, సర్పంచ్ ముద్దాడ ప్రభావతి భాస్కర నాయుడు, ఏఎంసీ చైర్మన్ భాస్కరరావు, పోలాకి వైసీపీ మండల అధ్యక్షులు కృష్ణారావు, కన్వీనర్ సత్తిబాబు, రామారావు, అప్పన్న, దాలినాయుడు తదితరులు పాల్గొన్నారు.
0 Comments