శ్రీకాకుళం స్పోర్ట్స్ న్యూస్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్ పూర్ వేదికగా ఈ నెల 2వ తేది నుంచి 4వ తేది వరకూ జరుగనున్న 37వ జాతీయ సబ్ జూనియర్ కొర్గీ చాంపియన్ షిప్ పోటీలకి శ్రీకాకుళం నగరానికి చెందిన జామి సాక్షిత్ ఎంపిక కావడం పట్ల జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠ్కర్ అభినందించారు.ఇటీవల నంద్యాలలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో సాక్షిత్ సత్తా చాటి గోల్డ్ మెడల్ ను సాధించి జాతీయ స్థాయి పోటీలకి ఎంపికయ్యాడు. పోటీలలో పాల్గొనేందుకు బయలుదేరే ముందు శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠ్కర్ కలిసిన సందర్భంగా ఆయన సాక్షిత్ ను అభినందించారు. జాతీయ స్థాయి పోటీలో కూడా రాణించి జిల్లాకి పేరు ప్రతిష్టలను తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. చిన్న తనంలోనే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనే స్థాయికి సాక్షిత్ ఎదగడం పట్ల అభినందించారు. భవిష్యత్ లో కూడా మరిన్ని పోటీలలో పాల్గొని తల్లితండ్రులకి,కోచ్ లకి ,జిల్లాకి పేరు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ సూచించారు. జాతీయ స్థాయి పోటీలకి ఎంపికైన సాక్షిత్ కి జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠ్కర్ తో పాటు శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రతినిధులు తైక్వాండో శ్రీను , నౌపడ విజయ్ కుమార్ ,వైశ్యరాజు మోహన్ ,గిడుతూరి వెంకటేశ్వరరావు ,ఎం.సుధీర్ వర్మ ,బలభద్రుని రాజా,డా.కంఠ వేణు,గురుగుబెల్లి ప్రసాద్ ,బెవర జ్యోతి ప్రసాద్ ,వాండ్రింగి శ్రీనివాసరావు తదితరులు అభినందించారు.
0 Comments