శ్రీకాకుళం స్పోర్ట్స్ న్యూస్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయ్ పూర్ వేదికగా ఈ నెల 2వ తేది నుంచి 4వ తేది వరకూ జరుగనున్న 37వ జాతీయ సబ్ జూనియర్ కొర్గీ,12వ జాతీయ సబ్ జూనియర్ పూమ్ సే తైక్వాండో చాంపియన్ షిప్ పోటీలకి నేషనల్ రిఫరీగా శ్రీకాకుళంకి చెందిన మజ్జి గౌతమ్ నియమితులయ్యారు. ఈ మేరకు తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రెటరీ జనరల్ ఆర్.డి.మంగేశ్వర్ నియామక ఉత్తర్వులు జారీ చేసారు. శ్రీకాకుళం నగరానికి చెందిన మజ్జి గౌతమ్ గత కొన్ని సంవత్సరాలుగా తైక్వాండో కోచ్ గా కొనసాగుతున్నారు. ఎంతో మంది తైక్వాండో క్రీడాకారులను ఆయన తీర్చిదిద్దారు. అలాగే రాష్ట్ర,జాతీయ స్థాయి తైక్వాండో పోటీలలో టెక్నికల్ అఫీషియల్ గా,రిఫరీగా కూడా పనిచేసారు. సీనియర్ తైక్వాండో క్రీడాకారుడైన గౌతమ్ కోచ్ గా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. చత్తీస్ గఢ్ తైక్వాండో అసోసియేషన్ సారధ్యంలో తైక్వాండో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయి తైక్వాండో పోటీలను నిర్వహిస్తుంది. ఈ పోటీలకి నేషనల్ రిఫరీగా మజ్జి గౌతమ్ వ్యవహరించనున్నారు. నేషనల్ రిఫరీగా నియమితులైన మజ్జి గౌతమ్ ను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠ్కర్ అభినందించారు. భవిష్యత్ లో కూడా మరింత ఉన్నత స్థానానికి చేరుకోవాలని జిల్లాకి చెందిన క్రీడాకారులు రాణించేలా శిక్షణలను అందించాలని ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీకేష్ లాఠ్కర్ గౌతమ్ కి సూచించారు. నేషనల్ రిఫరీగా నియమితులైన గౌతమ్ ను శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ప్రతినిధులు తైక్వాండో శ్రీను , నౌపడ విజయ్ కుమార్ ,వైశ్యరాజు మోహన్ ,గిడుతూరి వెంకటేశ్వరరావు ,ఎం.సుధీర్ వర్మ ,బలభద్రుని రాజా,డా.కంఠ వేణు,గురుగుబెల్లి ప్రసాద్ ,బెవర జ్యోతి ప్రసాద్ ,వాండ్రింగి శ్రీనివాసరావు తదితరులు అభినందించారు.
0 Comments