ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

గురుకులాల్లో ప్రవేశాలకు ధరఖాస్తులకు ఆహ్వానం. ప్రిన్సిపాల్ మార్పు జ్యోతి

శ్రీకాకుళం, ఫిబ్రవరి 02: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల,కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల
ప్రిన్సిపాల్ మార్పు జ్యోతి అన్నారు. శుక్రవారం ఆమె పత్రికా సమావేశం నిర్వహించారు. ఐదవ తరగతిలో ప్రవేశానికి విద్యార్థుల నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. ఎస్సీ-70, ఎస్టీ-5, బీసీ-4, ఓసీ-1, ఇంటర్మీడియట్ లో ప్రవేశానికి బైపిసి-40, ఎంపీసీ-40 సీట్లు భర్తీ చేయనున్నట్టు ప్రిన్సిపాల్ తెలిపారు. ఈనెల 23 నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు.మూడు,నాలుగు తరగతులను గుర్తింపు పొందిన పాఠశాలలో చదివి, వార్షిక ఆదాయం లక్ష లోపు ఉండి,సొంత జిల్లా వారు అర్హులన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ఇంటర్మీడియట్లో ప్రవేశాలకు ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ నాటికి 17 సంవత్సరాలు దాటని విద్యార్థులు అర్హులన్నారు. కళాశాలలో విశాలమైన గ్రౌండ్, చక్కటి వాతావరణం ఉన్నాయని తెలిపారు. పేరెంట్స్ కోసం వెయిటింగ్ హాల్, విద్యార్థుల కోసం లైబ్రరీ, ప్రకృతి వాతావరణంలో చదువు వల్ల పిల్లలు మానసిక ఉత్సాహం కలిగి బాగా చదువుతారని ఆమె వివరించారు.

Post a Comment

0 Comments