శ్రీకాకుళం,ఫిబ్రవరి,2: ఎలక్ట్రోరల్ చేర్పులు, మార్పులు జాగ్రత్తగా పరిశీలించాలని రాష్ట్ర ముఖ్య ఎలక్ట్రోరల్ అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. శుక్రవారం ఆయన విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి డ్రాఫ్ట్ పబ్లికేషన్ నాటికి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల స్థితి, ప్రత్యేకంగా 30 రోజులకు పైగా పెండింగ్‌లో ఉన్న ఫారంలు, ఎస్ఎస్ఆర్-2024 సమయంలో స్వీకరించిన ఫారమ్‌లు, ముసాయిదా జాబితాపై ఓట్ల చేర్పులు, తొలగింపులు, సవరణలు, 2024-సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల భద్రత, పోలిస్ స్టేషన్లు, కౌంటింగ్ సెంటర్లు ఏర్పాట్లు, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫైనల్ పబ్లికేషన్ అయిన తర్వాత వివిధ రకాల ఫారాలు అందుతున్నట్లు చెప్పారు. ఫైనల్ పబ్లికేషన్ తర్వాత వచ్చిన ధరఖాస్తులపై మాట్లాడుతూ పరిశీలన జరపకుండా ఏ దరఖాస్తును అప్రూవల్ చేయకూడదన్నారు. చేర్పులు, తొలగింపులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించి చేయాలని చెప్పారు. తప్పుడు తొలగింపులు, చేర్పులు పై ఈఆర్వోలు బాధ్యత వహించాలని ఆదేశించారు. తరచు సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు.
జిల్లా నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ మాట్లాడుతూ జిల్లాలో ఎలక్ట్రోరల్ రోల్స్ ఫైనల్ పబ్లికేషన్ అయిన తర్వాత కూడా వచ్చిన దరఖాస్తులు గూర్చి వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు గూర్చి తెలియజేశారు. ఎన్నికల విధులు నిర్వహణ సిబ్బంది, జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, తదితర అంశాలపై కలెక్టర్ వివరించారు. వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. నవీన్, టెక్కలి సబ్ కలెక్టర్ నూరుల్ కమర్, అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్ఓ ఎం. గణపతిరావు, ఆర్డీఓలు డాక్టర్ యస్. భరత్ నాయక్, సి.హెచ్. రంగయ్య, ఉప కలెక్టర్లు పద్మావతి, అప్పారావు, జడ్పీ సీఈవో వెంకటరామన్, తదితరులు పాల్గొన్నారు.
0 Comments