ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

'ప్రోటోకాల్ పాటించని వారిపై చర్యలు తీసుకోండి'

నరసన్నపేట మేజర్ పంచాయతీ ఈఓ చిన్నారావు కు శివనగర్ కాలనీ 12వ వార్డు మెంబర్ జి.రామారావు శనివారం ఫిర్యాదు చేశారు. శివనగర్ కాలనీ 12వ వార్డులో నరసన్నపేట గ్రామపంచాయతీ నిధులు మూడు లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మించారని తెలిపారు. అయితే ఈ ప్రహరీ గోడ ప్రారంభోత్సవం ఈ నెల 16వ తేదీన జరిగిందని అన్నారు. అయితే ప్రహరీ గోడ ప్రారంభ శిలాఫలకంపై తన పేరు లేదని స్పష్టం చేశారు. ప్రోటోకాల్ పాటించని బాధ్యులపై చర్య తీసుకోవాలని కోరారు.

Post a Comment

0 Comments