భావన. శ్రీను (సర్పంచ్) మెమోరియల్ టోర్నమెంట్
టోర్నమెంట్ను ప్రారంభించిన పోలాకి సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ
క్రీడలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి
పోలాకి, జూన్ 7: భావన శ్రీనివాసరావు మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ను తలసముద్రం గ్రామంలో ప్రారంభించారు. టోర్నమెంట్ను ముఖ్య అతిథిగా హాజరైన పోలాకి సబ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. టోర్నమెంట్ కి 48 టీములు పేర్లు నమోదు చేసుకున్నాయి.
ఈ సందర్భంగా ఎస్ఐ సత్యనారాయణ మాట్లాడుతూ క్రీడల వల్ల మానసిక ఉల్లాసం పెరుగుతుందని, క్రీడలు ఆడటం వల్ల గెలుపు ఓటమి లా మధ్య వ్యత్యాసం తెలియడం వల్ల మానసికంగా దృఢమవుతారని తెలిపారు. ఈరోజు జరిగిన మ్యాచుల్లో బోరుభద్ర పై గాతల వలస విజయం సాధించగా రెండో మ్యాచ్ నరసన్నపేట పై సత్యవరం విజయం సాధించింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వైకుంఠ రావు, దుప్పట్ల మధు, మల్లి బాబు, దుర్రు. శ్రీనివాసరావు, దుప్పట్ల శ్రీను, కామేసు, పోతల రమణ దుబ్బాక గిరి , జయవర్ధన్ పాల్గొన్నారు
0 Comments