శ్రీకాకుళం: పాలిచ్చే తల్లులకు ప్రత్యేకగది అవసరమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు.
సోమవారం రోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (మీకోసం) కార్యక్రమానికి వచ్చే పాలిచ్చే తల్లులకు, మహిళలకు, జిల్లా పరిషత్ లో పనిచేసే మహిళా ఉద్యోగులకు ఉపయోగపడేలా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేశారు.
సోమవారం జిల్లాపరిషత్ సమావేశ మందిరం ప్రక్క గదిలో ఏర్పాటు చేసిన గదిని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్లల జననాల రేటును పెంచడానికి మరియు ఆడపిల్లలను రక్షించడానికి, బేటీ బచావో బేటీ పడావో కింద బేబీ ఫీడింగ్ రూమ్‌లను తెరవడం జరిగిందన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ పంచాయతీ రాజ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. శ్రీకాకుళం, టెక్కలి, పలాస, నరసన్నపేట ఆర్టీసీ బస్టాండ్‌లో బేబీ ఫీడింగ్ రూంలు త్వరలో ప్రారంభించడం జరుగుతుందన్నారు.
ప్రతి సోమవారంరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే పాలిచ్చే తల్లులకు, మహిళలకు, జిల్లా పరిషత్ లో పనిచేసే మహిళా ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
ప్రత్యేకంగా ఒక గదిని ఉన్నట్లు అందరికీ తెలిసేలా సూచిక బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. చిన్న పిల్లలకు తల్లులు పాలిచే గది ఏర్పాటుచేయడం సంతోషకరమన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహమద్ ఖాన్, జిల్లా రెవిన్యూ అధికారి ఎం.గణపతి రావు, డిఆర్డిఎ, పి.డి కిరణ్, సిఈఓ జిల్లా పరిషత్ వెంకటేశ్వర రావు, ఐసిడిఎస్ పిడి శాంతిశ్రీ, డిఎంఅండ్ హెచ్ ఓ డా బి. మీనాక్షి, డిసిహెచ్ఎస్ డా రాజ్యలక్ష్మి, ఎస్ సి కార్పొరేషన్ ఇ.డి గడెమ్మ, వెనుకబడిన తరగతులు సంక్షేమ అధికారిణి అనురాధ, విభిన్న ప్రతిభవంతుల అధికారిణి కవిత తదితరులు పాల్గొన్నారు.
0 Comments